విక్రేత ఏం కోరుకుంటున్నారో తెలుసుకోవాలి. ప్రాపర్టీ అమ్ముతున్న వ్యక్తి అవసరం ఏమిటి? అతడు ఏ ధరకు ప్రాపర్టీని అమ్మేయాలని నిర్ణయించుకున్నాడు? ఎన్ని రోజుల్లోగా అతడికి డబ్బు అవసరం వంటి వివరాలు తెలుసుకోగలిగితే ప్రాపర్టీని సొంతం చేసుకోవడంలో మీరు ఓ మెట్టు పైకి ఎక్కినట్టే.
* తనఖా కోసం ముందస్తు అనుమతి తీసుకోవాలి. మోర్టగేజ్ కు ప్రీ అప్రూవల్ లేకుండా ప్రాపర్టీ కొనుగోలుకు వెళ్లడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
* సమయానుకూలంగా ఉండాలి. రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఓ ఆస్తిని కొనుగోలు చేయడం కంటే విక్రయించడమే సులభం. అందువల్ల సౌకర్యవంతమైన తేదీలు, నిబంధనలతో కొనుగోలుదారులు కొత్త ఇంటిని కొనడానికి గణనీయమైన అనుకూలతను విక్రేత నుంచి పొందుతాడు.
* భారీ డిపాజిట్ ఆఫర్ చేయాలి. ప్రాపర్టీ కోసం ఇచ్చే అడ్వాన్స్ ఎక్కువ మొత్తంలో ఉంటే మరీ మంచిది. విక్రేత 10 శాతం మొత్తాన్ని డిపాజిట్ కావాలని కోరుకుంటే.. మీరు 20 శాతం ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. దీంతో అమ్మకందారు మీ వైపు మొగ్గు చూపించడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
* నగదుతోనే చెల్లింపు చేయాలి. ఇంటికి చెల్లించే మొత్తం ఆన్ లైన్ లేదా బ్యాంకు ట్రాన్స్ ఫర్ వంటివి కాకుండా నేరుగా నగదుతో ఇస్తే విక్రేత మొగ్గు మీవైపే ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
* విక్రేతకు కొన్ని రాయితీలు ఇవ్వాలి. విక్రేత ముగింపు ఖర్చుల్లో కొంత భాగాన్ని చెల్లిస్తామని ఆఫర్ చేయండి. ఇంటి మరమ్మతులు లేదా ఇతర వ్యయ సంబంధిత అంశాలపై మంచి నిర్ణయం తీసుకోండి. ఇంటిని యథాతథంగా అంగీకరించి మరమ్మతులు మీరే చేయించుకోవడం కూడా ఓ రాయితీయే. ఇంటిని విక్రయించిన తర్వాత కూడా విక్రేతను కొంతకాలంపాటు ఎలాంటి అద్దె లేకుండా అందులో ఉండటానికి అనుమతించండి.
* మదింపు గ్యాప్ హామీని ఆఫర్ చేయాలి. అనుకున్న ఇంటి ధర కంటే మదింపు గ్యాప్ ధర ఎక్కువగా ఉన్నప్పుడు ఆ వ్యత్యాసాన్ని భరిస్తానని మాట ఇవ్వండి.
* విక్రేతకు లేఖ రాయాలి. ఆ ప్రాపర్టీని మీరు ఎందుకు కావాలనుకుంటున్నారో వివరిస్తూ విక్రేతకు సవిరంగా లేఖ రాయాలి. ఈ నేపథ్యంలోనే మీరు సాధ్యమైనంత ఎక్కువ మొత్తం ఆఫర్ చేస్తున్నట్టు వివరించాలి. ఇది విక్రేత మీ వైపు మొగ్గు చూపేలా చేసే చాన్స్ ఉంది.
* వీలైనంత క్లీన్ గా ఆఫర్ ఉండాలి. సాధారణంగా విక్రేతలంతా ఎలాంటి ఇబ్బందులూ లేని లావాదేవీలే కోరుకుంటారు. అందువల్ల మీ ఆఫర్ సాధ్యమైనంత క్లీన్ గా ఉండాలి. ఎక్కడైనా నగదే రారాజు. అందుకు ఎలాంటి ఎస్కలేషన్ క్లాజ్ లేని ఆఫర్ ఉంటే మంచిదని నిపుణుల సలహా.
This website uses cookies.