Categories: EXPERT COLUMN

ఇంటీరియ‌ర్స్.. ఇలా చేయించాలి!

జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్ వంటి ఖ‌రీదైన ప్రాంతాల్లోని ఆధునిక భ‌వ‌నాల్లా మ‌న ఇంటిని తీర్చిదిద్దాలంటే.. చేతిలో ఎన్ని ల‌క్ష‌లున్నా స‌రిపోదు. అయితే, కాస్త ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే నామమాత్రపు ఖర్చుతో ఇంటిని అందంగా ముస్తాబు చేసుకోవచ్చు. ఇందుకోసం ఫ్లాటు విలువ‌లో 10 నుంచి 15 శాతం సొమ్మును ఇంటీరియ‌ర్స్ కోసం వెచ్చించాలి. ఉదాహ‌ర‌ణ‌కు, రూ.50 ల‌క్ష‌లు పెట్టి ఒక ఫ్లాటును కొనుగోలు చేస్తే.. క‌నీసం 5-7.5 ల‌క్ష‌లైనా ఇంటీరియర్స్ కోసం ఖర్చు పెట్టాలి.

మీరెంతో కష్టపడి కొనుక్కున్న ఫ్లాట్ ఇంటీరియర్స్ మొత్తం చేయించాలా? లేక వార్డురోబులు, కిచెన్ పని చేయిస్తే సరిపోతుందా? అనే అంశంలో నిర్ణయానికి రావాలి. కిచెన్లో క్రాకరీ యూనిట్లు, హాల్లో టీవీ యూనిట్ మాత్రమే కావాలా? అలా కాకుండా, ఫిటెడ్ ఫర్నీచర్ నుంచి వాల్ ట్రీట్మెంట్ చేయాలా? వంటి విషయాలపై స్పష్టత ఏర్పరుచుకోవాలి. కొందరేం చేస్తారంటే సివిల్ పనుల సమయంలోనే ఇంటీరియర్స్ పనుల్ని చేయిస్తారు. ఉదాహరణకు, ఫ్లోరింగ్, సీలింగ్, ప్లంబింగ్, ఎలక్ట్రీకల్ వంటి పనుల సమయంలోనే ఇంటీరియర్స్ పనుల్ని ఆరంభిస్తారు. మరి, 1200 చదరపు అడుగు విస్తీర్ణం గల రెండు పడక గదుల ఫ్లాట్ కు అయ్యే ఖర్చెంతో పట్టికలో చూసేద్దామా..

లివింగ్, డైనింగ్

వినీర్ డెకోలం(ల్యామినేట్)
టీవీ యూనిట్ +
క్రాకరీ 97,000 90,000
పార్టీషన్ కోసం రూ.30 వేలు ఎక్కువ అవుతుంది.

మాస్టర్ బెడ్రూమ్ 1.70 లక్షలు 1.55 లక్షలు
వార్డ్ రోబ్ +
స్టడీ + డ్రెసింగ్
యూనిట్

చిల్డ్రన్ బెడ్రూమ్ 1.25 లక్షలు 1.15 లక్షలు
వార్డ్ రోబ్ +
స్టడీ + డ్రెసింగ్
యూనిట్

కిచెన్

నార్మల్ కిచెన్ 1.10 లక్షలు
(షెల్ఫులు + ట్రేలు)

మాడ్యులార్ కిచెన్ 2 లక్షలు
టాల్ యూనిట్+ రైస్ బాక్స్
+ ఫ్లికర్ బాక్స్, మ్యాజిక్ ట్రే

జిప్సం సీలింగ్

వైరింగు, సీలింగ్ లైట్లతో రూ.1.80 లక్షలు
కలిపి

* వైరింగ్, సీలింగ్ లైట్లు రూ.70,000
మినహాయిస్తే..

* మొత్తానికి, టూ బెడ్రూమ్ ఇంటిని ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ఎంతలేదన్నా రూ.6 లక్షలైనా ఖర్చవుతుంది. అంతకంటే తక్కువలో కూడా చేసుకోవచ్చు. కాకపోతే, తక్కువ రకం సామగ్రిని వాడాల్సి ఉంటుంది. కొన్నాళ్ల పాటు మన ఇంటీరియర్స్ మన్నికగా ఉండాలంటే.. నిపుణులైన వ్యక్తుల సలహా మేరకే ఇంటీరియర్స్ పనులు చేపట్టాలి.

కె.హిమబిందు
ఆర్కిటెక్ట్, ఆర్ బీ అసోసియేట్స్
9849832342

This website uses cookies.