ప్రతి రియల్ ఎస్టేట్ ఏజెంట్ సెక్షన్ 9 లోని సబ్ సెక్షన్ (2) ప్రకారం రెరాలో నమోదు చేసుకోవాలి. ఫారమ్ జి ద్వారా దరఖాస్తు చేసుకుని కొన్ని వివరాలు సమర్పించాలి
సంస్థ లేదా వ్యక్తి పేరు, చిరునామా, సంస్థ ఎలాంటి రకానికి (యాజమాన్యం, సొసైటీలు, భాగస్వామ్యం, కంపెనీ తదితరాలు)
సంస్థ రిజిస్ట్రేషన్ వివరాలు (యాజమాన్య సంస్థగా, భాగస్వామ్యంగా, కంపెనీ, సొసైటీ మొదలైనవి) ఉప చట్టాలు, మెమోరాండమ్ సహా సంఘం యొక్క వ్యాసాలు మొదలైనవి.
రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఒక వ్యక్తి అయితే.. అతడు లేదా ఆమె పేరు, చిరునామా, సంప్రదింపు వివరాలు, ఫొటో.. అదే సంస్థ అయితే, భాగస్వాములు, డైరెక్టర్లు మొదలైనవారి వారి పేర్లు, ఫొటోలు, సంప్రదింపు వివరాలు
రియల్ ఎస్టేట్ ఏజెంట్ పాన్ కార్డు కాపీ
వ్యాపార స్థలం చిరునామా ధ్రువీకరణ పత్రం
ఈ వివరాలన్నింటితో రియల్ ఎస్టేట్ ఏజెంటుగా నమోదు చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి.
ఏదైనా షెడ్యూల్ బ్యాంకులో తీసుకున్న డీడీ లేదా బ్యాంకర్స్ చెక్ ద్వారా లేదా ఆన్ లైన్ చెల్లింపు ద్వారా దరఖాస్తుదారు వ్యక్తి అయితే రూ.10వేలు, సంస్త అయితే రూ.50వేలు చెల్లించాలి.
నిబంధన 8 కింద దరఖాస్తు అందిన తర్వాత రెరా 30 రోజుల వ్యవధిలో సదరు ఏజెంటుకు రిజిస్ట్రేషన్ మంజూరు చేయడం లేదా దరఖాస్తు తిరస్కరించడం జరుగుతుంది.
ఒకవేళ దరఖాస్తులో ఏవైనా లోపాలుంటే వాటిని సరిదిద్ది మళ్లీ సమర్పించే అవకాశం ఇస్తుంది.
రియల్ ఎస్టేట్ కింద నమోదైన ఏజెంటుకు దాని కాల వ్యవధి ఐదేళ్లు ఉంటుంది.
ఐదేళ్ల గడువు ముగిసిన తర్వాత మళ్లీ నిర్దేశిత పత్రాలు, ఫీజు చెల్లించి పునరుద్ధరించుకోవచ్చు.
రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ కోసం దరఖాస్తుతోపాటు వ్యక్తి అయితే రూ.5వేలు, సంస్థ అయితే రూ.25 వేలు చెల్లించాలి.