Categories: LATEST UPDATES

పెట్టుబడుల్లో దూకుడు

ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో
రూ.21,100 కోట్ల పెట్టబడులు

మన రియల్టీ రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బాగానే సాగుతోంది. ఆరంభంలోనే భారీగా పెట్టుబడులు ఆకర్షించింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌)లో రియల్ పెట్టుబడులు 20 శాతం మేర పెరిగినట్టు కొలియర్స్ ఇండియా వెల్లడించింది. ఈ త్రైమాసికంలో 2.52 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 21,100 కోట్లు) పెట్టుబడులు వచ్చినట్టు తెలిపింది. ప్రధానంగా వేర్‌హౌసింగ్‌, రెసిడెన్షియల్‌ ప్రాజెక్టులకు నిధులు వెల్లువలా వస్తున్నాయి. ఫలితంగా తొలి త్రైమాసికంలో రియల్టీ రంగానికి 252.85 కోట్ల డాలర్ల సంస్థాగత పెట్టుబడులు వచ్చాయని.. గతేడాది క్యూ1లో నమోదైన 210.64 కోట్ల డాలర్లతో పోలిస్తే ఇది 20 శాతం అధికమని కొలియర్స్ ఇండియా వివరించింది.

దేశంలో ఆఫీస్ లీజింగ్ దూకుడుగానే ఉన్నప్పటికీ.. గతేడాదితో పోలిస్తే, ఈ పెట్టుబడులు ఆఫీస్ ప్రాపర్టీల్లో 83 శాతం మేర క్షీణించాయి. గతేడాది క్యూ1లో రూ.15,860 కోట్ల మేర ఆఫీస్ ప్రాపర్టీల్లోకి పెట్టుబడులు రాగా, ఈ ఏడాది క్యూ1లో రూ. 2,750 కోట్లు మాత్రమే వచ్చాయి. అదే సమయంలో రెసిడెన్షియల్ ప్రాపర్టీల్లోకి నిధులు భారీగా పెరిగాయి. గతేడాది క్యూ1లో రెసిడెన్షియల్ విభాగంలోకి 7.23 కోట్ల పెట్టుబడులు రాగా, ఈ ఏడాది క్యూ1లో 54.35 కోట్ల డాలర్లను తాకాయి. అలాగే ఇండస్ట్రియల్‌, వేర్‌హౌసింగ్‌ ప్రాజెక్టులకు సంస్థాగత పెట్టుబడులు 13.39 కోట్ల డాలర్ల నుంచి 153.3 కోట్ల డాలర్లకు పెరిగాయి. రియల్టీ పెట్టుబడులు సమకూర్చుతున్న సంస్థాగత ఇన్వెస్టర్లలో విదేశీ ఇన్వెస్టర్లు 81 శాతం వాటాను ఆక్రమిస్తుండగా.. దేశీ సంస్థలు 0.5 బిలియన్‌ డాలర్లు అందించాయి.

This website uses cookies.