స్టాన్టీ లైఫ్ స్టైల్స్ హైదరాబాద్ లో మొదటి లగ్జరీ హోమ్ సొల్యూషన్ స్టోర్ ‘స్టాన్లీ లెవల్ నెక్ట్స్’ను ప్రారంభించింది. తిరుగులేని నాణ్యత, కళానైపుణ్యం కోరుకునే వారికి ఇది పూర్తి స్థాయిలో లగ్జరీ హోమ్ ఇంటీరియర్ సొల్యూషన్స్ ను అందిస్తుంది. ఈ రంగంలో 25 ఏళ్లుగా ఉన్న స్టాన్లీ దేశీయంగా వృద్ధి చెందిన లగ్జరీ ఫర్నీచర్ బ్రాండ్ గా గణనీయ స్థానం పొందింది. డిజైన్, మెటీరియల్, టెక్నిక్స్ లాంటివాటిని ఇది అంతర్జాతీయంగా సమకూర్చుకుంటుంది. అంతర్జాతీయ బ్రాండ్లతో తీవ్రంగా పోటీపడుతుంది. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రోడ్ నెం.12 లో ది గ్రాండ్ బాల్ రూమ్ వద్ద ‘స్టాన్లీ లెవల్ నెక్ట్స్’ ని ఏర్పాటు చేసింది.
ఈ స్టోర్ తో ఇది ప్రపంచ మొట్టమొదటి కిచెన్ మరియు క్యాబినెట్స్ క్యాబినెట్రీ కల్ట్ బై స్టాన్లీని ఆవిష్కరించింది. జర్మనీ ప్రిసిషన్ తయారీ, ఫ్రెంచ్ కార్పెంట్రీ టెక్నిక్స్, ఇటాలియన్ డిజైన్ సెన్సిబిలిటీస్ లతో స్టాన్లీ ఉన్నత శ్రేణి కిచెన్, క్యాబినెట్రీలను అందిస్తుంది. వివిధ స్టైల్స్, రంగులు, పరిమాణాలు, ఫ్లోర్ ప్లాన్ లలో వచ్చే క్యాబినెట్లు కొనుగోలుదారులకు వారి కిచెన్, మొత్తం ఇంటి క్యాబినెట్రీ అవసరాలను తీర్చేలా వివిధ స్టయిల్స్, లేఅవుట్స్ తో ఉంటాయి.
‘స్టాన్లీ లెవల్ నెక్ట్స్’ స్టోర్ 12000 చ.అ.ల విస్తీర్ణంలో నెలకొని ఉంది. ఇది అత్యున్నత శ్రేణికి చెందిన ఫర్నీచర్, క్యాబినెట్రీ, యాక్సెసరీస్, పూర్తి శ్రేణి హోమ్ సొల్యూషన్స్ ను ఒకే చోట అందిస్తుంది. తిరుగులేని డిజైన్ అను భూతిని అందించేలా ఈ స్టోర్ రూపొందించబడింది. ఈ సందర్భంగా స్లాన్లీ గ్రూప్ వ్యవస్థాపకులు, సీఈఓ సునీల్ సురేశ్ మాట్లాడుతూ, ‘‘అందమైన వాటి తయారీకర్తలుగా మేం మా మొదటి లగ్జరీ హోమ్ సొల్యూషన్స్ స్టోర్స్ ‘స్టాన్లీ లెవల్ నెక్ట్స్’ ను ప్రారంభించేందుకు భారతదేశపు అత్యంత గొప్ప నగరమైన హైదరాబాద్ ను ఎంచుకున్నాం.
బంజారాహిల్స్ లో ఈ స్టోర్ ఉంది. ఇక్కడి మార్కెట్ ఎంతో విస్తృతమైంది. చక్కటి కళానైపుణ్యానికి పెరుగుతున్న డిమాండ్ తో మేం అందించే వాటిని మరింతగా విస్తరించాల్సి ఉంటుంది’’ అని అన్నారు. క్యాబినెట్రీ కల్ట్ ను ప్రారంభిస్తున్నందుకు మేమెంతగానో గర్విస్తున్నాం. ఇది రెండు ప్రపంచాల మేలు కలయిక. జర్మనీ సాంకేతిక నైపుణ్యం, ఇటాలియన్ డిజైన్ ఈ రెండూ నాణ్యం కోసం మేం పడే తపనతో కలగలసి జీవాన్ని అందిస్తాయి. ఇది మరెక్కడా చూడని కిచెన్, క్యాబినెట్రీల విశిష్ట కలెక్షన్ ను కలిగి ఉంటుంది’’ అని అన్నారు.