హైదరాబాద్ మహా నగరం వేగంగా అభివృద్ది చెందుతోంది. గత కొన్నేళ్లుగా అంతర్జాతీయస్థాయిలో మౌళిక వసతులు ఏర్పాటవ్వడంతో పాటు మల్టీ నేషనల్ సంస్థలు హైదరాబాద్ కు క్యూ కట్టడంతో భాగ్యనగరం జెట్ స్పీడ్ తో డెలవల్ అవుతోంది. ఈ క్రమంలోనే ప్రపంచంలో వేగంగా అభివృద్ది చెందుతున్న నగరాల జాబితాలో మన హైదరాబాద్ స్థానం సంపాందించుకుంది. ప్రపంచ ప్రఖ్యాత సంస్థ సావిల్స్ గ్రోత్ హబ్స్ ఇండెక్స్ ప్రపంచవ్యాప్తంగా 2033 నాటికి టాప్ టెన్ నగరాలపై అంచనా వేసింది. వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ నగరాల్లో హైదరాబాద్ కు చోటు లభించింది. సావిల్స్ సంస్థ గ్రోత్ హబ్స్ ఇండెక్స్ జీడీపీ, వ్యక్తిగత సంపద, జనాభా పెరుగుదల , వలసలను ఆధారంగా తీసుకొని అంచనా వేసి ఆర్థిక పరిపుష్టి సాధించే నగరాలను ర్యాంకింగ్ చేస్తూవస్తోంది.
వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ నగరాల జాబితాలో భారత్ కు చెందిన నాలుగు నగరాలు టాప్ టెన్ లో నిలిచాయి. బెంగళూరు మొదటి స్థానంలో ఉండగా.. దేశ రాజధాని ఢిల్లీ మూడో స్థానం లో నిలిచింది. హైదరాబాద్ ఐదో స్థానం సాధించింది. ఇక భారత దేశ వాణిజ్య రాజధాని ముంబై 8వ స్థానంలో నిలిచింది. భారత్ లోని నాలుగు నగరాలు 2033 నాటికి 68 శాతం కన్నా ఎక్కువ పెరుగుదలతో గణనీయమైన జీడీపీ సాధిస్తాయని సావిల్స్ గ్రోత్ హబ్స్ ఇండెక్స్ అంచనా వేసింది. అభివృద్ది చెందుతున్న టెక్ హబ్ లు, నైపుణ్యం కలిగిన యువత, శ్రామిక శక్తి తదితరాలు హైదరాబాద్ ను ప్రపంచ భవిష్యత్ నగరాల జాబితాలో నిలపడంలో కీలక పాత్ర పోషించనున్నాయని పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా రానున్న రోజుల్లో పట్టణీకరణ మరింత పెరిగే అవకాశ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు పట్టణాలకు వలసరావడం వల్ల ప్రతిభావంతులకు కొదవ ఉండదనే అభిప్రాయం వ్యక్తం చేసింది సావిల్స్ గ్రోత్ హబ్స్ ఇండెక్స్.
1. బెంగళూరు ఇండియా
2. హో చి మిన్ సిటీ వియత్నాం
3. ఢిల్లీ ఇండియా
4. షెన్జెన్ చైనా
5. హైదరాబాద్ ఇండియా
6. హెనోయి వియత్నాం
7.గ్వాంగ్జౌ చైనా
8. ముంబై ఇండియా
9. మనీలా ఫిలిప్పీన్స్
10. రియాద్ సౌదీ అరేబియా
This website uses cookies.