Categories: LATEST UPDATES

18 నుంచి ఐజీబీసీ గ్రీన్ బిల్డింగ్ సదస్సు

హరిత భవనాల(గ్రీన్ బిల్డింగ్స్)కు సంబంధించి పలు అంశాలు అందరూ తెలుసుకునేందుకు వీలుగా ఐజీబీసీ ఓ సదస్సు ఏర్పాటు చేసింది. ఐజీబీసీ 19వ గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ ఈనెల 18, 19, 20వ తేదీల్లో జరగనుంది. ‘నెట్ జీరో- బిల్డింగ్స్, బిల్ట్ ఎన్విరాన్ మెంట్’ అనే అంశంపై మూడురోజులపాటు వర్చవల్ విధానంలో ఈ సమావేశం జరుగుతుంది. దాదాపు 80 మంది జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు గ్రీన్ బిల్డింగులకు సంబంధించి తమ అభిప్రాయాలను, ఉత్తమ విధానాలను పంచుకోనున్నారు. అంతేకాకుండా దాదాపు 500కి పైగా హరిత ఉత్పత్తులు, టెక్నాలజీలను వర్చువల్ విధానంలో ప్రదర్శించనున్నారు.

This website uses cookies.