Categories: LATEST UPDATES

రాజపుష్ప ఇంపీరియాలో.. గ్రేస్ టవర్ ఆవిష్కరణ

రాజపుష్ప సంస్థ తెల్లాపూర్లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ప్రాజెక్టే.. రాజపుష్ప ఇంపీరియా. సుమారు 24 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో వచ్చేవి ఎనిమిది టవర్లు. 40 అంతస్తుల ఎత్తులో ఉండే ఈ టవర్లలో ఒకటైన గ్రేస్ టవర్ ని తాజాగా ఈ కంపెనీ ఆవిష్కరించింది. ఈ ప్రాజెక్టు ప్రత్యేకత ఏమిటంటే.. దాదాపు 82 శాతం ఓపెన్ స్పేస్ ఉంటుంది.

డెక్ తో కూడుకున్న రెండు స్విమ్మింగ్ పూళ్లు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫీస్ స్పేసెస్, సన్ డెక్ అపార్టుమెంట్స్ కలిగిన ఈ ప్రాజెక్టులో క్లబ్ హౌస్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. దీన్ని జీ ప్లస్ 4 అంతస్తుల ఎత్తులో నిర్మిస్తారు. ప్రీమియం లైఫ్ స్టయిల్ అపార్టుమెంట్స్ అయిన రాజపుష్ప ఇంపీరియాలో ఫ్లాట్ ధర.. చదరపు అడుక్కీ రూ.6699 మాత్రమే. ఈ ప్రాజెక్టుని 2026 మార్చిలో కొనుగోలుదారులకు అందిస్తామని సంస్థ చెబుతోంది.

ఆగస్టు 1 నుంచి రేటు పెంపుదల

రాజపుష్ప ప్రావిన్షియాలో జులై 31 వరకూ ఫ్లాట్ కొనుగోలు చేసేవారికి.. ధర చదరపు అడుక్కీ రూ.8099 మాత్రమేనని సంస్థ ప్రకటించింది. అదే ఆగస్టు 1 నుంచి కొనేవారికి చదరపు అడుక్కీ రూ.100 పెంచి.. రూ.8,199కి విక్రయిస్తామని చెబుతోంది. సుమారు 23. 75 ఎకరాల్లో నిర్మించే రాజపుష్ప ప్రావిన్షియాలో వచ్చేవి 11 టవర్లు. ఒక్కో టవర్ ఎత్తు.. జీ ప్లస్ 39 అంతస్తులు. ఫ్లాట్ల విస్తీర్ణం చదరపు అడుక్కీ 1370 నుంచి 2660 దాకా ఉంటాయి. ఇందులో వచ్చేవి రెండు క్లబ్ హౌజులు.

కేవలం క్లబ్ హౌజును సుమారు లక్షన్నర చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. విశాలమైన విస్తీర్ణంలో కడుతున్న ఈ ప్రాజెక్టులో ప్రతి ఫ్లాటుకు ఈవీ ఛార్జింగ్ సదుపాయాన్ని కల్పిస్తారు. ఇండోర్లో ఏసీ బాస్కెట్ బాల్ కోర్టును పొందుపరుస్తారు. 2025 మార్చిలోపు మొదటి విడత ఫ్లాట్లను అందజేస్తారు.

This website uses cookies.