ఊసరవెల్లి ఫేమ్ అద్విక్ మహాజన్ పెద్దవాడు అయినప్పటికీ, ఇంకా తన చిన్ననాటి నివాసంతో ఎంతో అనుబంధం కలిగి ఉన్నారు. అది తన జీవితంలోనే అత్యుత్తమ సమయం అని చెబుతుంటారు. తన పూర్వికుల ఇంట్లో గడిపిన ఆ రోజులు ఆయన జీవితంలోనే బంగారు రోజులని.. ఆ ఇల్లు ఇప్పుడు లేనప్పటికీ, ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ అలా పదిలంగానే ఉంటాయని పేర్కొంటున్నారు. తన చిన్ననాటి ఇంటి సంగతులను టైం మెషీన్ లో వెనక్కి వెళ్లి మళ్లీ చూసినట్టుగా కళ్లకు కట్టినట్టు చెప్పారు. ‘జలంధర్ లోని మా ఇంటి వరాండాలో ఓ మంచం ఉండేది. దానిపై ద్రాక్ష చెట్టు ఉండేది. నేను స్కూల్ నుంచి తిరిగి వచ్చిన ప్రతిసారీ ఆ ద్రాక్ష పళ్లను అందుకోవడమే పనిగా పెట్టుకునేవాడిని. నేను చేసే అల్లరితో ఇల్లంతా సందడిగా ఉండేది. ఇక ఆ ఇంట్లో మరో మధురమైన జ్ఞాపకం.. పీటర్. నా పెంపుడు శునకం. అది ఎప్పుడూ నాతోనే ఉండేది. దానిని వాటేసుకుని సరదా సరదాగా గడిపేవాడిని. ఆ ఇంటి తర్వాత ఉమ్మడి కుటుంబంలో జీవించిన ఆనందం ఎప్పుడూ కలగలేదు’ అని అద్విక్ వివరించారు.
తెలుగులో తన పునరాగమనం తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా దూసుకెళ్తానని ప్రకటించిన అద్విక్.. తన గురించి మరిన్ని సంగతులు పంచుకున్నారు. ‘ఆస్తుల విషయానికి వస్తే.. ఏళ్లు గడిచేకొద్దీ పెట్టుబడులు పెట్టడంలో నా అనుభవం పది రెట్లు పెరిగింది. నా స్వగ్రామంలో మేం మూడు బంగ్లాలు మార్చుకున్నాం. గతేడాది నా తల్లిదండ్రుల కోసం నా సొంత ఇంటిని డిజైన్ చేశాను. టీవీ నుంచి దాదాపు ఎనిమిది నెలలపాటు విరామం తీసుకున్నాను. ఆ సమయంలో మా నాన్నతో కలిసి ఇంటీరియర్స్ చేయడంలో నిమగ్నమయ్యాను. ఇంటికి వైరింగ్ చేయడంతోపాటు ఎలాంటి స్టోన్ వాడాలి? ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఎంపిక, ఫర్నిచర్ కొనుగోలు, గ్లాస్ డిజన్స్.. ఇలా అన్నీ నేనే డిజైన్ చేసుకున్నాను. వీటిలో చాలా అంశాలు ఢిల్లీ నుంచి వచ్చాయి. ఇక ముంబైకి వచ్చి 14 ఏళ్లు అయింది. ఈ సమయంలో ఏడు ఇళ్లు మారాం. అయితే, ఇంటీరియర్ అంశాలు ఎలా ఉన్నాయనేది వివరంగా చెబుతాను’ అని పేర్కొన్నారు.
‘ఆ సంగతులు కూడా మళ్లీ నన్ను చిన్ననాటి రోజులకు తీసుకెళ్తాయి. ఆదివారాలు అంటే.. ఇంటిని శుభ్రం చేయడానికి, మరమ్మతు చేయడానికి లేదా అలంకరించడానికి ఉన్న సమయం అని మా నాన్న చెప్పారు. అలా చేయడం ద్వారా ఇల్లు ఎప్పటిప్పుడు కొత్త రూపు సంతరించుకుంటుందన్నారు. ఇది మా నాన్న చేసిన చిన్న సూచన. కానీ నేను దానికి విపరీతమైన ప్రాధాన్యత ఇచ్చాను. తనువు, మనసు దానిపైనే పెట్టి పని చేశాను. అనంతరం కొద్ది సమయంలోనే మెకానిక్ అవసరం లేకుండా నా స్కూటర్ ను సర్వీస్ చేయడం ప్రారంభించాను. తర్వాత మా నాన్నగారి కారును తళతళలాడేలా చేసేవాడిని. ఇవన్నీ నాలో ఒక రకమైన సహనాన్ని పెంపొందించాయి. నా రాబోయే ఇళ్లను ఎప్పటికప్పుడు కొత్తగా ఉంచాలనే భావాలు నింపేశాయి’ అని అద్విక్ మహాజన్ తెలిపారు.
ఓ విశాలమైన బంగ్లా నుంచి వన్ బీహెచ్ కు మారి సర్దుకుపోయి గడిపిన సందర్భాన్ని సైతం ఆయన వివరించారు. ‘ఒకప్పుడు నేను నలుగురు అబ్బాయిలతో కలిసి నివసించాను. నేను కింద వేసిన మ్యాట్రెస్ పై పడుకునేవాడిని. వారంతా కార్పొరేట్ కు వెళ్లే అబ్బాయిలు. నేను నటుడిగా మారడానికి చాలా కష్టపడిన రోజులవి. జీవనశైలి పెరిగేకొద్దీ నా ఇల్లు కూడా బాగా పెరిగింది. ప్రస్తుతం నా కొత్ల ఇల్లు అంతా శ్వేతమయం. నేను, నా భార్య ఎంచుకున్న రంగుల్లో జీవించడం ఓ అద్భుతమైన ఆనందం. అది ఎంతో వెచ్చగా, హాయిగా, ఆకర్షణీయంగా ఉంటుంది. మా కొత్త ఇంటికి ఇంటీరియర్లు ఎంచుకోవడంలో మా మధ్య ఎలాంటి విభేదాలూ లేవు. వ్యక్తిగతంగా నేను గులాబీరంగును ఇష్టపడతాను’ అని వివరించారు.
‘నేను లండన్ లేదా దుబాయ్ లో నా కలల సౌధాన్ని నిర్మించాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో నాతోపాటు వ్యవస్థాపక పరంపర కూడా పెరుగుతోంది. దానిని ఈ దేశాలలో ఒకచోట విస్తరించడాన్ని ఇష్టపడతాను. స్టార్టప్ లు, వాణిజ్యం, ఫ్యాషన్ లకు ప్రపంచ రాజధానిగా లండన్ కనిపిస్తుంది. అది రాబోయే నా ప్లాన్. కానీ నా భార్య నేహా నిజంగా అర్జున్ బిజ్లానీ ఇంటిని మెచ్చుకుంటుంది. ఇది యూరోపియన్ స్టైల్ వైట్ థీమ్. ప్రవేశద్వారం గోపురం ఆకారంలో ఉంటుంది. ఫ్లోరింగ్ పాలరాయితో ఉంటుంది. ఇంటి మధ్యలో ఆలయం ఉం. ఇటీవల వారి ఇంటికి వెళ్లినప్పుడు ఇవన్నీ నా భార్యకు బాగా నచ్చాయి’ అని అద్విక్ మహాజన్ పేర్కొన్నారు.
This website uses cookies.