2022లో 34 లక్షల మందికి హోమ్ లోన్స్
వడ్డీ రేట్లు, ఇళ్ల ధరలు పెరిగినప్పటికీ రియల్ హవా కొనసాగుతోంది. గతేడాది 34 లక్షల మంది ఇంటి రుణాలు తీసుకోవడమే ఇందుకు నిదర్శనం. బ్యాంకులు, ఇతర రుణ సంస్థలు కలిసి 2022లో దేశవ్యాప్తంగా 34 లక్షల మందికి రూ.9 లక్షల కోట్ల విలువైన గృహ రుణాలు మంజూరు చేసినట్టు వెల్లడైంది. 2021తో పోలిస్తే ఇది 18 శాతం అధికం. మొత్తం రుణాలు తీసుకున్నవారిలో రూ.25 లక్షల లోపు హోమ్ లోన్ తీసుకున్నవారి సంఖ్య 67 శాతం కావడం విశేషం. రూ.75 లక్షల నుంచి రూ.కోటి వరకు రుణం తీసుకున్నవారి సంఖ్య 36 శాతం పెరిగింది. ఇక వ్యక్తిగత రుణాల్లోనూ 57 శాతం పెరుగుదల కనిపించింది. కాగా, 2022 నాటికి రిటైల్ రుణ మార్కెట్ విలువ రూ.100 లక్షల కోట్లకు చేరినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మొత్తంగా 54 కోట్ల లోన్లు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక 2022 డిసెంబర్ చివరి నాటికి ఫర్నిచర్, గృహోపకరణాల కోసం లోన్లు తీసుకున్నవారి సంఖ్య 6.5 కోట్లుగా ఉంది. 2021తో పోలిస్తే ఇది 48 శాతం ఎక్కువ.
This website uses cookies.