ప్రతి హౌసింగ్ ప్రాజెక్టుకు శిక్షణ పొందిన ఆధీకృత ఏజెంట్లను మాత్రమే నియమించాలని రెరా స్పష్టం చేసింది. అలా కాకుండా నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ మేరకు మహారాష్ట్ర రెరా తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
మహారాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రాజెక్టుల అమ్మకాలు, మార్కెటింగ్ వ్యవహారాల్లో పని చేస్తున్న శిక్షణ పొందిన, అధీకృత ఏజెంట్ల పూర్తి వివరాలు తమకు సమర్పించాలని ఆదేశించింది. రియల్ ఎస్టేట్ ఏజెంట్లు శిక్షణ పొంది సర్టిఫికెట్ తీసుకుని రెరాలో నమోదు చేసుకోవాలని గతేడాది జనవరి 10న మహారెరా ఉత్తర్వులిచ్చింది. అయితే, ఈ ప్రక్రియలో జాప్యం నెలకొనడంతో పలుమార్లు గడువు పొడిగిస్తూ వచ్చింది. ఏజెంట్లకు పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. రియల్ పరిశ్రమకు చెందిన నిపుణులతో వివిధ అంశాలపై సూచనలు ఇప్పించింది. అనంతరం సర్టిఫికెట్ తీసుకోవడానికి ఏజెంట్లకు ఏడాది గడువు ఇచ్చింది. ఆ గడువు తర్వాత సర్టిఫికెట్ లేకుండా ఏజెంట్ రిజిస్ట్రేషన్, రెన్యువల్ చేయబోమని స్పష్టంచేసింది. అయినప్పటికీ కొందరు డెవలపర్ల మహారెరా ఆదేశాలను పెడచెవిన పెట్టారు. దీంతో అలాంటి బిల్డర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని రెరా నిర్ణయించింది. ప్రాజెక్టు రిజిస్ట్రేషన్ దరఖాస్తును తిరస్కరించడం, ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయి ఉంటే రద్దు చేయడం, భారీగా జరిమానా విధించడం వంటివి ఇందులో ఉన్నాయి.
This website uses cookies.