పేరు: జనప్రియ ఉన్నతి
ఎక్కడ: ఇస్నాపూర్
విస్తీర్ణం: 4 ఎకరాలు
టవర్లు: 3
ఫ్లాట్లు: 670
సైజులు: 355 నుంచి 800 చ.అ.
ఎప్పుడు పూర్తి: 2023 జూన్
రేటు: రూ.17.47 లక్షల నుంచి
హైదరాబాద్లో ఎక్కడ చూసినా బడా ఫ్లాట్లే కడతారు.. లగ్జరీ సదుపాయాల్పి కల్పిస్తూ.. కోట్లలో ధర చెబుతారు.. కానీ, ఇంత తక్కువ రేటుకే ఫ్లాట్లను ఎవరు విక్రయిస్తున్నారు? ఇదేమైనా యూడీఎస్ స్కీమా? అయినా.. హైదరాబాద్లో సామాన్యుల గురించి ఆలోచించే బిల్డర్లు కూడా ఉన్నారా? ఇలాంటి సందేహాల్ని మిమ్మల్ని చుట్టిముట్టాయా? అయితే, మీరు తప్పకుండా ఓ సంస్థ గురించి తెలుసుకోవాల్సిందే. గత మూడు దశాబ్దాలుగా భాగ్యనగరంలో వేలాది మంది మధ్యతరగతి ప్రజానీకం సొంతింటి కలను సాకారం చేసిన జనప్రియ ( Janapriya ) .. ఎప్పటిలాగే అందుబాటు ధరలో లగ్జరీ ఫ్లాట్లను అందించడానికి ముందుకొచ్చింది. ఈసారి పటాన్ చెరు వద్ద ఇస్నాపూర్‌ను ఇందుకు ఎంచుకుంది. మరి, రెరా అనుమతి పొందిన ఈ ప్రాజెక్టు ప్రత్యేకతలేమిటో చూసేద్దామా..
‘జనప్రియ’ సంస్థ ప్రత్యేకత ఏమిటంటే.. భవిష్యత్తులో అభివృద్ధికి ఆస్కారమున్న ప్రాంతాల్ని ఎంచుకుంటుంది. అందులో కొన్నవారు ఆ తర్వాత పెరిగే ఇంటి విలువను చూసి ఎంతో సంతోషిస్తారనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే, మియాపూర్లో కేవలం లక్ష రూపాయలకే ఫ్లాటు అందించిన ఘనత జనప్రియకే దక్కుతుంది. అది కూడా కేవలం పది వేలు కడితే చాలు.. మిగతా సొమ్మును రుణం ఇప్పిచ్చేవారు. ఆ తర్వాతక్రమంలో ఇంటి విలువ దాదాపు పది నుంచి పదిహేను లక్షలైంది. అంటే, చేతిలో నుంచి పెట్టింది పది వేలే అని గుర్తుంచుకోండి. సరిగ్గా, ఇప్పుడు కూడా అందుబాటు ఇళ్ల ప్రాజెక్టును నిర్మించేందుకు ఇస్నాపూర్ ని ఎంచుకుంది. ఇందుకు కారణాలు లేకపోలేవు.
ప్రస్తుతం హైదరాబాద్ పరిధి విస్తరిస్తోంది. నిన్నటివరకూ చందానగర్ వరకే సిటీ లిమిట్స్ అనుకునేవారు. ఇప్పుడేమో బీరంగూడ తర్వాత ముత్తంగి ఓఆర్ఆర్ వరకూ నగరం విస్తరించింది. పైగా, అక్కడ్నుంచి నగరానికి రోజు రాకపోకల్ని సాగించేందుకు ప్రజా రవాణా వ్యవస్థ మెరుగ్గా ఉంది. ఇస్నాపూర్ చేరువలోనే స్కూళ్లు, కాలేజీలు, మార్కెట్లు, ఆస్పత్రులు వంటివి ఉన్నాయి. ఇక్కడ్నుంచి ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డుకు నాలుగు నిమిషాల్లో చేరుకోవచ్చు. పదిహేను నిమిషాల్లో పటాన్ చెరు బస్ డిపో, అరగంటలో లింగంపల్లి రైల్వే స్టేషన్ కు వెళ్లొచ్చు. ఎలా చూసినా, ఇస్నాపూర్ భవిష్యత్తులో అభివృద్ధికి మంచి స్కోప్ ఉందని చెప్పొచ్చు.
రేటు తక్కువ అని జనప్రియ సంస్థ సదుపాయాల్ని అందజేసే విషయంలో రాజీ పడటం లేదు. లగ్జరీ ప్రాజెక్టుల్లో ఉన్నట్టుగానే ఇందులో ప్రత్యేకంగా స్విమ్మింగ్ పూల్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. జిమ్ ఏర్పాటు చేస్తోంది. చిల్డ్రన్స్ ప్లే ఏరియాలు, ల్యాండ్ స్కేప్డ్ గార్డెన్స్, కమ్యూనిటీ హాల్ వంటి సౌకర్యాల్ని కల్పిస్తోంది. ఇందులో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకుంటే.. 2 బీహెచ్కే కోసం సుమారు రూ.28 లక్షలు పెడితే సరిపోతుంది. పైగా, ఇందులో ఫ్లాట్ కొంటే.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీము కింద రూ.2. 67 లక్షల దాకా వడ్డీ రాయితీ లభిస్తుంది.
This website uses cookies.