Categories: LATEST UPDATES

క్యూసీఐ ఛైర్మన్ గా జక్సే షా నియామకం

క్రెడాయ్ మాజీ ఛైర్మన్ మరియు సావీ గ్రూప్ వ్యవస్థాపక ఛైర్మన్ జక్సే షా క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (క్యూసీఐ) ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఆయన ఈ పదవిలో సుమారు మూడేళ్ల పాటు కొనసాగుతారు. ఈ సందర్భంగా ఆయన రియల్ ఎస్టేట్ గురుతో మాట్లాడుతూ.. 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలనే ప్రధానమంత్రి దార్శనికతను సాధించడమే లక్ష్యంగా పని చేస్తానని తెలిపారు. నాణ్యతకు సంబంధించి సరికొత్త విప్లవాన్ని తీసుకొస్తామన్నారు.

క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను 1997లో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దేశంలోని మూడు ప్రధాన పరిశ్రమ సంఘాలైన అసోచామ్, సీఐఐ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ లు కలిసి సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. నేషనల్ క్వాలిటీ క్యాంపెయిన్ ద్వారా జాతీయ అక్రిడిటేషన్ నిర్మాణాన్ని ఏర్పాటు చేయడంతో పాటు నిర్వహించడం మరియు నాణ్యతను ప్రోత్సహించడం క్యూసీఐ ప్రధాన కర్తవ్యం. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.

This website uses cookies.