Categories: PROJECT ANALYSIS

ట్రెండ్ సెట్ జయభేరి ఎలివేట్

సరికొత్త స్థాయి లగ్జరీకి స్వాగతమని ట్రెండ్ సెట్ జయభేరి ఎలివేట్ మీ అందరినీ సాదరంగా ఆహ్వానిస్తోంది. శిల్పారామం దాటిన తర్వాత కొత్తగూడ జంక్షన్ కంటే ముందే ఎడమవైపు.. సుమారు తొమ్మిది ఎకరాల్లో కొలువుదీరిన ఈ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్లో.. ఆరు బ్లాకుల్లో 526 ఫ్లాట్లను నిర్మిస్తారు. ఒక్కో టవర్ 18 నుంచి 20 అంతస్తుల ఎత్తులో ఉంటుంది. కేవలం సెంట్రల్ కోర్టు యార్డునే 1.5 ఎకరాల స్థలంలో ముస్తాబు చేస్తున్నారు. తివాచీ పర్చిన పచ్చదనం ప్రాజెక్టుకే ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.

హై ఎండ్ లగ్జరీకే మారుపేరుగా నిలిచే ట్రెండ్ సెట్ జయభేరి ఎలివేట్ ప్రాజెక్టులో.. ఫ్లాట్ల విస్తీర్ణం 1855 నుంచి 4110 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తారు. నాలుగు బ్లాకుల్లో కేవలం ఐదు ఫ్లాట్లు.. రెండు బ్లాకుల్లో 4 ఫ్లాట్ల చొప్పున నిర్మిస్తారు. ఆరంభ ధర రూ.1.96 కోట్లు అని సంస్థ చెబుతోంది. రెరా అనుమతి గల ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు యమజోరుగా జరుగుతున్నాయి.

అంతా సవ్యంగా సాగితే 2021 జూన్ నుంచి కొనుగోలుదారులకు ఫ్లాట్లను అప్పగిస్తామని సంస్థ చెబుతోంది. ఫోర్ లెవెల్ క్లబ్ హౌజ్ ప్రాజెక్టుకే ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. 45 వేల చదరపు అడుగుల్లో డెవలప్ చేసే క్లబ్ హౌజ్ లో పొందుపర్చని సౌకర్యమంటూ లేదు. హోమ్ థియేటర్, డబుల్ హైట్ రిసెప్షన్ ఏరియా, మోడ్రన్ జిమ్, స్విమ్మింగ్ పూల్, బార్ ఏరియా, కార్డ్స్ రూమ్, బ్యాంకెట్ హాల్.. ఇలా పొందుపర్చని సౌకర్యమంటూ లేదు. మొత్తానికి, నగరం నడిమధ్యలో లగ్జరీ సదుపాయాల్ని ఆస్వాదించాలని కోరుకునేవారికి ఇంతకుమించిన ప్రాజెక్టు లేదనే చెప్పాలి.

This website uses cookies.