- గోరెగావ్ వెస్ట్ లో రూ.29 కోట్లతో కొనుగోలు
బాలీవుడ్ నటి కాజోల్ ముంబై గోరెగావ్ వెస్ట్ లో దాదాపు రూ.29 కోట్ల విలువైన 4,365 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఓ రిటైల్ స్థలాన్ని కొనుగోలు చేశారు. బంగూర్ నగర్ లోని లింకింగ్ రోడ్డులో ఉన్న ఓ ప్రాజెక్టు గ్రౌండ్ ఫ్లోర్ లో ఓ షాపును భారత్ రియాలిటీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఆమె కొన్నారు. మార్చి 6న రిజిస్ట్రేషన్ జరగ్గా.. రూ.1.72 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించారు. ఈ ప్రాపర్టీతోపాటు ఐదు కార్ పార్కింగులు కూడా వస్తాయి. కాగా, కాజోల్ 2023లో ముంబైలో రూ. 7.64 కోట్లకు ఆఫీస్ స్పేస్ కొనుగోలు చేశారు. 194.67 చదరపు మీటర్ల రెరా కార్పెట్ ప్రాంతంలో విస్తరించి ఉన్న ఈ ఆఫీస్ స్పేస్ ముంబైలోని అంధేరి వెస్ట్ లో వీర దేశాయ్ రోడ్‌లోని ఓషివారాలోని సిగ్నేచర్ బిల్డింగ్‌లో ఉంది.
అదే సంవత్సరం ఆమె భారత్ రియాలిటీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి రూ.16.50 కోట్లకు ముంబైలో ఒక అపార్ట్ మెంట్‌ను కొనుగోలు చేశారు. కాగా, ఈ నెల ప్రారంభంలో, అజయ్ దేవగన్ ముంబైలో 3,455 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న వాణిజ్య కార్యాలయ స్థలాన్ని రూ.7 లక్షల నెలవారీ అద్దెకు లీజుకు ఇచ్చినందుకు వార్తల్లో నిలిచారు. రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్‌తో పోలిస్తే వార్షిక అద్దె దిగుబడి ఎక్కువగా ఉండటంతో చాలా మంది బాలీవుడ్ తారలు వాణిజ్య ఆస్తులలో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడతారు. వాస్తవానికి బాంద్రా, ఖార్, అంధేరిలోని లోఖండ్‌వాలా, వర్లి వంటి ప్రాంతాలలో ఉన్న అనేక భవనాలు సినిమా తారలకు ఇష్టమైన స్థలాలుగా ప్రసిద్ధి చెందాయి.