ఒకవైపు కోనసీమ అందాల్ని ఆస్వాదిస్తూ.. మరోవైపు లగ్జరీ సదుపాయాలతో ఆనందించాలని ఎవరికి ఉండదు చెప్పండి. ఇలాంటి సదావకాశం మహా నగరాల్లో అయితే సాధ్యం కాదు. కాబట్టి, ప్రతిఒక్కరూ తమ మూలాల్ని వెతుక్కుంటూ వెనక్కి పోవాల్సిందే. కోనసీమ అందాల్ని కొన్నేళ్ల నుంచి వెండి తెర మీద చూసి తన్మయత్వం పొందుతున్నాం. ప్రస్తుతం ఆ పచ్చటి పరిసరాల్లో ఆధునిక సౌకర్యాల్ని అందించే మహత్తరమైన లగ్జరీ ప్రాజెక్టు ప్రారంభమైంది. అదే.. కాటూరి గ్రీన్ హోమ్స్.
పశ్చిమ గోదావరి జిల్లాలో ఐదో అతి పెద్ద పట్టణమైన తణుకులో ప్రప్రథమ గేటెడ్ కమ్యూనిటీ కాటూరి గ్రీన్ హోమ్స్ ఆరంభమైంది. రెరా అనుమతి పొందిన ఈ ప్రాజెక్టును సత్యశ్రీ లైఫ్ స్పేసెస్ ప్రొబిల్డ్ సంస్థ వేల్పూరు రోడ్డులో నిర్మిస్తోంది. తివాచీ పర్చిన పచ్చదనంలో సేదతీరాలని కోరుకునేవారికిదో చక్కటి ప్రాజెక్టుగా అభివర్ణించవచ్చు. ఈ ప్రాజెక్టు నుంచి అత్యవసరాల్లో ఆస్పత్రుల్ని నిమిషాల వ్యవధిలో చేరుకోవచ్చు. ఐదు నిమిషాల్లో షాపింగ్, థియేటర్ వంటివాటికి వెళ్లొచ్చు. ఇక స్కూళ్లు, కాలేజీలు వంటివి దగ్గర్లోనే ఉన్నాయి. పౌర సదుపాయాలకు చేరువగా ఉండటం వల్ల అధిక శాతం మంది ఈ ప్రాజెక్టు వైపు ఆసక్తిగా చూస్తున్నారు.
నగరాల్లో నివసించేవారికి ఏమాత్రం తీసిపోని విధంగా సరికొత్త సౌకర్యాల్ని పొందుపరుస్తున్న ఈ ప్రాజెక్టులో మొత్తం 333 ఫ్లాట్లు వస్తాయి. మొదటి విడతలో భాగంగా 160 ఫ్లాట్లను నిర్మిస్తారు. టూ బెడ్రూమ్ ఫ్లాటును 1150 చదరపు అడుగుల్లో కడతారు. త్రీ బెడ్రూమ్ ఫ్లాట్లను 1610 చ.అ. విస్తీర్ణంలో నిర్మిస్తారు. దాదాపు అరవై శాతం ఖాళీ స్థలాన్ని వదిలిపెట్టిన ఈ నిర్మాణంలో పన్నెండు వేల చదరపు అడుగులో క్లబ్ హౌస్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో స్విమ్మింగ్ పూల్, కిడ్స్ పూల్, బ్యాడ్మింటన్ కోర్టులు, జిమ్, జాగింగ్ ట్రాక్, క్రికెట్ నెట్స్, సూపర్ మార్కెట్, సన్ డెక్, వీఐపీ లాంజ్, యోగా రూమ్, గెస్ట్ రూములు వంటివి పొందుపరుస్తారు.
This website uses cookies.