Categories: LATEST UPDATES

ఆస్పత్రి పడకల్లో పుణే టాప్

ప్రతి వెయ్యి మందికి 3.5 ఆస్పత్రి పడకలతో హెల్త్ ఇన్ ఫ్రాలో పుణే దేశంలోనే అగ్రస్తానంలో నిలిచింది. 1,000 మందికి దాదాపు 3.2 హాస్పిటల్ పడకలతో, అహ్మదాబాద్ ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉంది. 1,000 మందికి ఆసుపత్రి పడకల్లో బెంగళూరు మూడో స్థానంలో ఉన్నప్పటికీ.. జీవన సూచికలో మాత్రం అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ జాబితాలో ముంబై మూడో స్థానంలో ఉండగా.. హైదరాబాద్, చెన్న, కోల్ కతాలు ఆ తర్వాతి వరుస స్థానాల్లో ఉన్నాయి.

2018లో విడుదలైన ఒక నివేదిక ప్రకారం, భారతదేశం జీడీపీలో 3.5% మాత్రమే ఆరోగ్య సంరక్షణ కోసం ఖర్చు చేస్తుంది. యుఎస్, యుకె, జపాన్, జర్మనీ మరియు కెనడా వంటి దేశాలు తమ జీడీపీలో దాదాపు 10–18% ఆరోగ్య సంరక్షణ కోసం ఖర్చు చేస్తాయి. ప్రజారోగ్యం విషయానికొస్తే.. భారతదేశంలో ప్రతి వెయ్యి మందికి కేవలం అర మంచం మాత్రమే అందుబాటులో ఉంది. ఇక్కడ వైద్యులూ తక్కువే. ప్రతి వెయ్యి మందికి కేవలం 0.86 ఉన్నారు. ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ప్రతి వెయ్యి మందికి 2-4 మంది వైద్యులు ఉన్నారనే విషయం మర్చిపోవద్దు. జర్మనీలో అత్యధికంగా 4.3 మంది ఉండగా.. ఇటలీలో 4 ఉన్నారు. ఫ్రాన్స్ లో 3.3 మంది డాక్టర్లు ఉండగా.. అమెరికాలో 2.6, యూకేలో 2.8 మంది ఉన్నారు.

This website uses cookies.