poulomi avante poulomi avante

యూరప్ లో ఇల్లు.. నా కల

  • స్విస్ పర్వతాలలో విహరించాలనుకుంటున్నా
  • రియల్ ఎస్టేట్ గురుతో ఏక్ మినీ కథ ఫేమ్ కావ్యా థాపర్

చక్కని పరిసరాల్లో పెరిగిన రాబోయే టాలీవుడ్ సంచలనం కావ్యా థాపర్.. అందమైన ఇంటిని కలిగి ఉన్న నటి. తన ఇంటి గురించి రియల్ ఎస్టేట్ గురుతో చెప్పే ముందు.. ఆమె నివసించిన మొదటి నివాసానికి సంబంధించిన మధుర స్మృతులను గుర్తుచేసుకున్నారు. ‘నేను ఉమ్మడి కుటుంబంలో పెరిగాను. మేమంతా భాండూప్ లో ఓ బంగ్లాలో ఉండేవాళ్లం.

]మాది ఓ సాధారణ పంజాబీ కుటుంబం. ఈరోజు ఇండస్ట్రీలో నేను ఇలా ఉన్నానంటే.. దానికి నా కుటుంబమే కారణం. ఉమ్మడి కుటుంబం నాకు బంధాల ప్రాముఖ్యతను నేర్పించింది. పడుకునేటప్పుడు కథలు వినేదాన్ని. అమ్మ నాకు భోజనం పెట్టడం దగ్గర నుంచి ఎన్నెన్నో మధురానుభూతులు ఉన్నాయి. మా తాతయ్య ఎంతో క్రమశిక్షణతో ఉండేవారు. ఇక మా నాన్న అయితే, నన్ను ఎంత బాగా చూసుకునేవారో.. ఇవన్నీ ఆ ఒక్క బంగ్లాలో జరిగాయి. ఆ ఆనందాన్ని మరే విధంగా వ్యక్తంచేయలేను. కచ్చితంగా అలాంటి క్షణాలు నా పిల్లలకు కూడా అందిస్తా’ అని తెలిపారు.

మోనోక్రొమాటిక్ సింప్లిసిటీని అమితంగా ఇష్టపడే ఈ భామ.. రవితేజ తదుపరి సినిమాలో హీరోయిన్ గా చేస్తున్నారు. సంభాషణ కొనసాగిస్తూ.. ఆధునిక మినమిలిస్ట్ కాన్సెప్ట్ గురించి వివరించారు. ‘నాకు గది అలంకరణ అంత ముఖ్యం కాదు. కానీ కిటికీ వీక్షణ మాత్రం చాలా ముఖ్యం. అది చాలా పెద్దగా, శోభాయమానంగా ఉండాలి. కేకు మీద చెర్రీల్లా ప్రతి దేశం నుంచి వివిధ రకాల వస్తువులు ఉండాలి. అవి ఒకదానితో మరొకటి మాట్లాడేలా ఉండాలి.

kavya thapar

నేను ఎక్కడికైనా వెళ్లి వచ్చినప్పుడు అక్కడ నుంచి ఏదో ఒక గుర్తుండే వస్తువు తీసుకొస్తాను. కళ అనేది సరళంగా ఉండాలి. అదే సమయంలో ఆకర్షణీయంగా కనిపించాలి. అదే నాకు ఇష్టం’ అని వివరించారు. ప్రపంచంలోని డబ్బంతా మీ దగ్గర ఉంటే మీ కోసం ఎలాంటి ఇల్లు కట్టుకుంటారని సెలబ్రిటీలను ప్రశ్నించినప్పుడు వారు ఏదో ఒక ఎంపిక చెప్పేవారు. కానీ కావ్యా థాపర్ వారికి భిన్నంగా సమాధానం చెప్పారు. ప్రపంచంలోని డబ్బంతా తన వద్ద ఉంటే ఇళ్లు లేనివారికి ఇళ్లు కట్టిస్తానని బదులిచ్చారు.

తన రాబోయే కలల సౌథంలో డెకర్ గురించి మరింతగా వివరిస్తూ.. ‘నాకు తీరికలేని జీవితం ఉంది కాబట్టి.. నా ఇల్లు తగినంత విశ్రాంతి తీసుకోవడానికి అనువుగా ఉండాలి. కంటికి ఇంపుగా లేకున్నా పర్వాలేదు. మళ్లీ బంగ్లాయే నా ప్రాధాన్యత. అదే జరిగింది కూడా. మా ఉమ్మడి కుటుంబం మకాం మార్చాలనుకుంటున్నా. కానీ అక్కడ ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత గోప్యత కూడా ఉంది. డిజైన్ లో సింప్లిసిటీ ఉన్నా.. ప్రత్యేకత అనేది చాలా ముఖ్యమైన అంశం’ అని కావ్య వెల్లడించారు.

ఏక్ మినీ కథ ఫేమ్ అయిన కావ్య.. యూరప్ లో తన కలల నిలయాన్ని నిర్మించుకోవాలని అనుకుంటున్నారు. అతి త్వరలో ఆ రోజు వస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ‘ఎందుకంటే నేను ఫ్రెంచ్ డెకర్ పట్ల ఆకర్షితురాలినయ్యాను. నేను ఇటాలియన్ మార్బుల్ చూశాను. అది ఎంతో మంత్రముగ్ధులను చేస్తోంది. యూరప్ అంటే.. హోమ్ గోల్స్. తదుపరి నా మనసులో ఉన్న మరో ప్రదేశం.. స్విట్జర్లాండ్. వుడెన్ కాటేజ్ అనేది ప్రతి ఒక్కరి కల. అక్కడి గ్రామాలు కూడా ఎంతో అద్భుతంగా ఉంటాయి. తెల్లవారుజాము ఆనందం మీతో మాట్లాడుతుంది. నేను స్విస్ పర్వతాలలో విహరించాలనుకుంటున్నాను. అక్కడి అదిరిపోయే సీనరీలు చూడటం.. స్వచ్ఛమైన గాలి తీసుకోవడం నా కల’ అని చెప్పి ముగించారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles