బిల్డర్లు తమ ప్రాజెక్టుల మార్కెటింగ్, అమ్మకాలు చేసుకోవడం కోసం రాజస్థాన్ రెరా మినహాయింపు సర్టిఫికెట్లు జారీ చేయడం ప్రారంభించింది. బిల్డర్లు తాము పూర్తి చేసిన ప్రాజెక్టుల మార్కెటింగ్, విక్రయాలు చేసుకోవాలంటే నిబంధనల ప్రకారం సంబంధిత అధికారుల నుంచి కంప్లీషన్ సర్టిఫికెట్ తీసుకుని రెరాకు సమర్పించాలి. ఆ తర్వాతే మార్కెటింగ్, విక్రయాలు చేసుకోవాలి. ప్రస్తుతం దీని నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించి, ఆ మేరకు పూర్తయిన ప్రాజెక్టులకు మినహాయింపు సర్టిఫికెట్లు జారీ చేస్తోంది. ఇందుకోసం నామమాత్రపు రుసుం వసూలు చేస్తోంది.