కోకాపేట్ వేలం ( Kokapet Land Auction ) పాటకు అపూర్వ ఆదరణ లభించింది. హెచ్ఎండీఏ మొత్తం 49.94 ఎకరాల స్థలానికి వేలం పాటల్ని నిర్వహించింది. దీని ద్వారా ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.2000.37 కోట్ల ఆదాయం లభించింది. నగరానికి చెందిన రాజపుష్ప ప్రాపర్టీస్ రెండు ప్లాట్లను సొంతం చేసుకుంది. మై హోమ్ సంస్థ జూపల్లి రామేశ్వర్రావు కుమారుడు జూపల్లి శ్యామ్, జూపల్లి వినోద్ మరియు శ్రీనివాస రావు అరవపల్లి డైరెక్టర్లుగా ఉన్న ఆక్వా స్పేస్ డెవలపర్స్ సంస్థ రెండు ప్లాట్లను వేలంలో దక్కించుకుంది. గురువారం ఉదయం మొత్తం 30.77 ఎకరాల్ని వేలంలో విక్రయిస్తే.. ప్రభుత్వానికి సుమారు రూ.1,222.22 కోట్ల ఆదాయం లభించింది.
ఇందులో మొదటి ప్లాటును ఎకరాకు రూ.42.2 కోట్లు పెట్టి సత్యనారాయణ రెడ్డి మన్నె అనే వ్యక్తి 7.721 ఎకరాల్ని దక్కించుకున్నారు. అంటే, తను మొత్తం రూ.325.83 కోట్లు వెచ్చించి ఈ స్థలాన్ని దక్కించుకున్నారు. నగరానికి చెందిన రాజపుష్ప ప్రాపర్టీస్ మరో 7.755 ఎకరాల స్థలాన్ని ఎకరాకు 42.4 కోట్లు చొప్పున రూ.328.81 కోట్లను పెట్టి సొంతం చేసుకుంది. మూడో ప్లాటు విస్తీర్ణం 7.738 ఎకరాలు కాగా.. ఆక్వా స్పేస్ డెవలపర్స్ అనే సంస్థ ఎకరాకు రూ.36.4 కోట్లు చొప్పున రూ.281.66 కోట్లు పెట్టి స్థలాన్ని దక్కించుకుంది. మరో 7.564 ఎకరాల భూమిని బెంగళూరుకు చెందిన ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ఎకరాకు రూ.37.8 కోట్ల చొప్పున రూ.285.92 పెట్టి స్థలాన్ని దక్కించుకుంది.
This website uses cookies.