చిన్న అపార్ట్ మెంట్ దగ్గర నుంచి పెద్ద గేటెడ్ కమ్యూనిటీ వరకు రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు ఉండటం సర్వసాధారణం. వారి సమస్యలను ఉమ్మడిగా పరిష్కరించుకోవడానికి అసోసియేషన్ గా ఏర్పడి సంఘటితంగా ఉంటారు. అయితే, ఆయా అసోసియేషన్ల చట్టబద్ధతపై సందేహాలు వెలువడుతున్నందున తమను చట్టపరంగా గుర్తించాలని ఆయా అసోసియేషన్లు కోరుతున్నాయి. ఈ మేరకు పలు అసోసియేషన్ల ప్రతినిధులు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కలిసి వినతి పత్రం సమర్పించాయి. తమను చట్టపరమైన సంస్థగా గుర్తించాలని విన్నవించాయి.