Categories: Celebrity Homes

తారాలోకం చూతము రారండీ

సినీనటులంటే అందరికీ ఎంతో క్రేజ్. వారి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వారు ఏం తింటారు? ఎలా ఉంటారు? వారి ఇల్లు ఎలా ఉంటుంది? వంటి అంశాలు తెలుసుకోవాలనుకోవడమూ సహజం. మరి కొందరు తారల ఇళ్లు ఎలా ఉన్నాయో చూద్దామా?

ముందుగా వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు ఉప్పలపాటి ఇల్లు చూద్దామా? ఎవరో అర్థమైంది కదా? మన బాహుబలి ప్రభాస్.. ఆయన ఇల్లు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని అత్యంత ఆకర్షణీయమైన ప్రాంతాల్లో ఒకటి. రామానాయుడు స్టూడియోస్, పద్మాలయా స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ వంటి టాప్ టాలీవుడ్ స్టూడియోలు ఇక్కడే ఉన్నందున తారలు నివసించే గొప్ప ప్రదేశాల్లో ఇది టాప్.

ఇక ఘట్టమనేని మహేష్ బాబు ఇల్లు జూబ్లీహిల్స్ లో ఉంది. తన అభిరుచులకు సరిపోయేలా డిజైన్ చేసిన ఖరీదైన ఇంట్లో ఉంటున్నారు. ఇంట్లో ఇన్ఫినిటీ స్విమింగ్ పూల్, జిమ్, ప్రైవేట్ ఆఫీస్ ఉన్నాయి.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇల్లు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో ఉంది. ఆయన ఇంటి విలువ రూ.100 కోట్ల కంటే ఎక్కువ అని సమాచారం. పెద్ద ఇల్లే కాకుండా విశాలమైన పచ్చిక మైదానం, స్విమింగ్ పూల్ వంటివి ఉండటమే ఇందుకు కారణం. ఆరుబయట ఎలాంటి అవాంతరాలు లేకుండా ఆస్వాదించేందుకు వీలుగా ఉండే ఇంటిని ఆయన నిర్మించుకున్నారు.

ఫిల్మ్ నగర్ సెలబ్రిటీ హౌస్ లలో విజయ్ దేవరకొండ ఇల్లు కూడా ఒకటి. 2019లో విజయ్ ఫిల్మ్ నగర్ లోని తన కొత్త ఇంటికి మారాడు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, నానక్ రామ్ గూడతో కూడిన ప్రముఖ ప్రాంతం. గ్రాండ్ ఎంట్రీతో తెల్లని భారీ బంగ్లా కళ్లను కట్టిపడేస్తుంది. ఈ బంగ్లా విలువ రూ.15 కోట్లు. విజయ్ దేవరకొండ తల్లిదండ్రులు, సోదరుడు, పెంపుడు శునకం స్మార్ట్ తో కలిసి ఉంటున్నాడు.

కొణిదెల శివ శంకర వరప్రసాద్.. మెగాస్టార్ చిరంజీవి ఇల్లు జూబ్లీహిల్స్ లోనే ఉంది. ఆయన ఇల్లు ఓ కళాఖండానికి తక్కువేం కాదు. చిరు ఇల్లు పెద్దది, విశాలమైనదే కాదు.. సంపన్నమైనది కూడా.

నాగార్జున ఇల్లు జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబర్ 48లో ఉంది. పచ్చదనం, సహజమైన ప్రశాంతతో పాత బంగ్లా శైలిలో అద్భుతమైన రాజభవనంలా ఉంటుంది. ఆధునిక అలంకరణలతో పాత విక్టోరియన్ మెరుగులు చాలా కనిపిస్తాయి.

చిరంజీవి తనయకుడు రామ్ చరణ్ నివాసం కూడా రాజభవనానికి తక్కువేం కాదు. వారసత్వ ప్రేరిపిత డిజైన్ తో సమకాలీన సౌందర్యంతో 25వేల చదరపు అడుగులు కంటే ఎక్కువ విస్తీర్ణంలో రామ్ చరణ్ ఇల్లు ఉంది. ఈ ఇంటిని ఆయన రూ.30 కోట్లు చెల్లించి కొనుక్కున్నారు.

This website uses cookies.