poulomi avante poulomi avante

ఆస‌క్తి త‌గ్గిందా? అధిక‌మ‌వుతోందా?

కరోనా సమయంలో కూడా హైదరాబాద్ రియల్ మార్కెట్ మరీ అంతగా కుదేలు కాలేదు. ఇతర నగరాలతో పోలిస్తే ఇక్కడి రియల్ హవా బాగానే నడిచింది. అయితే, ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ప్రాభవం తగ్గుతున్నట్టు కనిపిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల కాలంలో రియల్ ఎస్టేట్ పోకడలను పరిశీలిస్తే.. ఇది సెటిలర్లకు అంత ఇష్టమైన నగరంగా లేదని అర్థమవుతోందని అంటున్నారు. అధికార టీఆర్ఎస్ ఇక్కడ రెండోసారి విజయం సాధించిన తర్వాత వారు అంతగా ఆసక్తి చూపించడంలేదని చెబుతున్నారు. ఆర్థిక మందగమనం ఇందుకు ఓ కారణం కాగా, కాస్త డబ్బున్న ఆంధ్రా ప్రజలు హైదరాబాద్ పై అంతగా ఆసక్తి చూపించకపోవడమే అసలైన అంశమని అంటున్నారు.

స్టాంపులు, రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అందుబాటులో ఉన్న గణాంకాలు.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో తిరోగమన ధోరణిని చూపిస్తున్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో గత నాలుగు నెలలుగా ఆస్తుల క్రయ విక్రయాలు చాలా తగ్గాయి. హైదరాబాద్ సౌత్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో మే నెలలో 3,337 లావాదేవీలు జరగ్గా.. జూన్ నాటికి 3,092కి తగ్గాయి. జూలైలో 3,764, ఆగస్టులో 4,103 లావాదేవీలు నమోదు కాగా, సెప్టెంబర్లో కేవలం 2,614 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయి. సంగారెడ్డి జిల్లాలో జూలైలో 31,903 రిజిస్ట్రేషన్లు జరగ్గా.. ఆగస్టులో 29,652, సెప్టెంబర్లో 27,492 రిజిస్ట్రేషన్లు జరిగాయి. హైదరాబాద్ కు ఆనుకుని ఉన్న మేడ్చల్, యాదాద్రి, భువనగిరి, సంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల్లోనూ ఈ తగ్గుదల కనిపిస్తోంది. మరోవైపు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అసెట్ క్లాస్ లలో వృద్ధి నమోదవుతోంది.

భారత ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో ఉన్నప్పటికీ.. దేశంలోని ఇతర అగ్ర రియల్ ఎస్టేట్ మార్కెట్లు ఢిల్లీ, ముంబై, బెంగళూరు కంటే హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంది. ఆఫీస్ స్పేస్ విషయంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఏకంగా 36 శాతం వాటాను హైదరాబాద్ కలిగి ఉండటం విశేషం. మాల్ డెవలపర్లు, రిటైలర్లు, వేర్ హౌసింగ్, లాజిస్టింగ్ కంపెనీలను కూడా ఈ నగరం బాగా ఆకర్షిస్తోంది. అలాగే రిసెర్చ్, కన్సల్టింగ్, అనలిటిక్స్, ఫైనాన్షియల్, ఇంజనీరింగ్, మన్యుఫాక్చరింగ్ వంటి ఇతర రంగాలకు చెందిన వారితో పాటు టెక్ కంపెనీలు, ఫ్లెక్సిబుల్ స్పేస్ ఆపరేటర్ల ద్వారా భవిష్యత్తులో మరింత ఆఫీస్ స్పేస్ వినియోగం అయ్యే అవకాశం ఉందని పరిశ్రమ అంచనా వేస్తోంది.
ఆఫీస్ లీజింగ్ యాక్టివిటీ కొత్త గరిష్ట స్థాయికి చేరుకోవడంతో స్వల్పకాలంలో ఈ విభాగం మరింత పుంజుకుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశాలన్నీ బెంగళూరు, హైదరాబాద్ మధ్య అంతరాన్ని తగ్గిస్తాయని చెబుతున్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం లుక్ ఈస్ట్ విధానం హైదరాబాద్ ఆరోగ్యకరమైన విస్తరణకు, రియల్ ఎస్టేట్ వర్గాల్లో సమతుల్య వృద్ధికి దోహదం చేస్తుందని అంటున్నారు. నివాస స్థలాల విషయంలో హైదరాబాద్ ఎప్పటికీ పోటీ మార్కెట్ గా ఉంటుందని.. అత్యధిక సగటు యూనిట్ల పరిమాణంలో హైదరాబాద్ ఇప్పటికీ అగ్రస్థానంలో ఉండటమే ఇందుకు నిదర్శనమని పేర్కొంటున్నారు. కో వర్కింగ్ స్పేస్ లో వృద్ధిని కూడా నగరం కొనసాగిస్తోంది. మొత్తమ్మీద హైదరాబాద్ రియల్ మార్కెట్.. దేశ రియల్టీ వృద్ధికి నాయకత్వం వహించనుందని చెబుతున్నారు.
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles