వాట్సాప్ ఏఐ బాట్ ఆధారిత మెట్రో టికెట్ బుకింగ్ ఆఫ్షన్ ను హైదరాబాద్ మెట్రో రైలు ప్రవేశపెట్టింది. ఇప్పటికే హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, పుణె నగరాల్లో అందుబాటులోకి తీసుకురాగా ఇప్పుడు నాగ్‌పూర్‌కు సైతం విస్తరించింది వాట్సాప్. ఇక వాట్సాప్‌లో మెట్రో టికెట్ ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకుందాం. వాట్సాప్‌ల మెట్రో టికెట్ సేవలు తెలుగుతో పాటు ఇంగ్లిష్, హిందీ, మరాఠీ భాషల్లో అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ వాసులు మెట్రో టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే 8341146468 మొబైల్ నెంబర్‌కు ‘Hi అని మెసేజ్ చేయాలి. లేదంటే వాట్సాప్‌లో వచ్చే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసినా సరిపోతుంది. అంతే కాదు వాట్సాప్ లో క్విక్ పర్చేజ్ ఆప్షన్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది.
ఈ సరికొత్త ఫీచర్ ద్వార మీరు రెగ్యులర్‌గా ప్రయాణించే రూట్లను సేవ్ చేసుకోవడం ద్వారా మెట్రో టికెట్ బుకింగ్‌ను ఈజీగా చేసుకోవచ్చు. దీంతో మెట్రోలో ప్రయాణించాల్సిన ప్రతీసారి గమ్యస్థానాలు, స్టార్టింగ్ పాయింట్లను సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక వాట్సాప్ మెట్రో ఫీచర్ ద్వారా ఒకేసారి ఆరు సింగిల్ జర్నీ టికెట్లు బుక్ చేసుకునే వెసులుబాటు ఉంది. అంతే కాదు ప్రతి ట్రాన్సాక్షన్ లో ఏకంగా 40 మంది ప్రయాణికులకు గ్రూప్ టికెట్లను బుక్ చేయవచ్చు. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం తో పాటు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డులతో టిక్కెట్ డబ్బులు చెల్లించవచ్చు.