Categories: LATEST UPDATES

హైదరాబాద్లో కొత్తగా..మైక్రోసాఫ్ట్ డేటాహబ్

మైక్రోసాఫ్ట్ సంస్థ హైదరాబాద్లో ప్రత్యేకంగా ఒక డేటా సెంటర్ ను ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంతో కలిసి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలో భాగంగా.. సుమారు యాభై ఎకరాల స్థలాన్ని మైక్రోసాఫ్ట్ కు కేటాయించగా.. తద్వారా మూడు వందల మందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే నెల రోజుల్లో వెలువడొచ్చు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 200 డేటాసెంటర్లు ఉన్నాయి. 1998లోనే హైదరాబాద్లో రిసెర్చ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.

2020లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ తెలంగాణలో సెకండ్ డేటా సెంటర్ ని ఏర్పాటు చేసింది. ఇందులో సుమారు 2.77 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టింది. ఫ్లిప్ కార్ట్, కంట్రోల్ ఎస్ వంటి సంస్థలూ ఇంచుమించు ఇలాంటి ప్రతిపాదనల్ని తెలంగాణ ప్రభుత్వంతో చేసినట్లు సమాచారం. గత ఏడేళ్లలో తెలంగాణ రాష్ట్రం సుమారు 33 బిలియన్ డాలర్ల పెట్టుబడుల్ని ఆకర్షించింది. 2014 నుంచి టీఎస్ ఐపాస్ ద్వారా దాదాపు 17,500 పెట్టుబడుల ప్రతిపాదనల్ని ఆమోదించింది. గత వారం, తెలంగాణ ప్రభుత్వం ఫార్మూలా కార్ రేసింగుకు ఆతిథ్యమిచ్చేందుకు ఎఫ్ఐఏ తో అంగీకారం కుదుర్చుకుంది. దీంతో భాగ్యనగరం బీజింగ్, బెర్లిన్, ప్యారిస్, మాస్కో, హాంగ్ కాంగ్ వంటి దేశాల సరసన చేరింది.

This website uses cookies.