మార్చి 1న.. హెచ్ఎండీఏ 38 ప్లాట్ల వేలం

హైద‌రాబాద్ చుట్టుప‌క్క‌ల గ‌ల రంగారెడ్డి, మేడ్చ‌ల్‌, సంగారెడ్డి జిల్లాలో 38 ప్లాట్ల‌ను మార్చి ఒక‌టిన వేలం వేయ‌డానికి హెచ్ఎండీఏ రంగం సిద్ధం చేసింది. ఎం.ఎస్.టి.సి ఆధ్వర్యంలో ఆన్ లైన్ వేలం ద్వారా వీటిని విక్రయించనున్న‌ది.  వంద శాతం చిక్కులు లేని,  క్లియర్ టైటిల్ ఉన్న ఈ ప్లాట్ల‌ను కొన్న‌వారు.. సత్వరమే భవన నిర్మాణ అనుమతులు పొంద‌వ‌చ్చు. మ‌రి, వేలం వేస్తున్న ప్లాట్లు ఎక్క‌డెక్క‌డ ఉన్నాయంటే..

రంగారెడ్ది జిల్లాలోని గండిపేట మండలంలో మూడు, శేరిలింగంప‌ల్లి మండలంలో ఐదు, ఇబ్రాహీంపట్నం మండలంలో రెండు చోట్ల ప్లాట్లు వేలం వేస్తారు. మల్కాజిగిరి జిల్లాలోని మేడిపల్లి మండలంలో నాలుగు, ఘట్ కేసర్ మండలంలో ఒకటి చొప్పున ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలోని అమీన్ పూర్ మండలం పరిధిలో పదహారు, ఆర్.సి పురం మండలంలో ఆరు, జిన్నారం మండలంలో ఒకటి చొప్పున ప్లాట్లు ఉన్నాయి. వెలిమల గ్రామంలోనే అందుబాటులో 121 గజాల నుంచి 3,630 గజాల ప్లాట్లు ఉన్నాయి. వీటిని కొనేందుకు ప్ర‌వాసులు, ఐటీ నిపుణులు, వ్యాపార‌వేత్త‌లు, పారిశ్రామిక‌వేత్త‌లు, డెవ‌ల‌ప‌ర్లు ఆస‌క్తి చూపిస్తున్నారు. అయితే, గ‌త వేలం మాదిరిగా ప్ర‌జ‌లు ఆశించిన స్థాయిలో ప్లాట్ల‌ను కొనుగోలు చేస్తారా? లేక తూతూమంత్రంగా వేలంలో పాల్గొంటారా? అనే విష‌యం మార్చి 1 న తెలుస్తుంది.

This website uses cookies.