నేను జంషెడ్‌పూర్‌లో సొంతిల్లు కొన్నాను. నిజానికి చెప్పాల్సి వస్తే.. అది కొనాల్సి వచ్చింది. దేవుడి దయ వల్ల ఆ ఇంటిని మా తల్లీదండ్రుల కోసం కొనగలిగాం. వారే ఆ ఇంట్లో ఉంటారు. నేను అయోధ్యలో పుట్టాను. సగం జీవితం తాతల నాటి పురాతన బంగళాలో ఉమ్మడి కుటుంబంలోనే గడిచింది. ఆ ఇంటికి చెందిన లాన్లలో మా కజిన్స్‌తో నిత్యం కొట్లాడుకునేవాళ్లం. నాకు ఆర్ట్ అంటే ఎంతో ఇష్టం. ప్రతిరోజు చెట్లకు నీళ్లు పోయడమంటే ఎంతో ఇష్టం. బంగళా అయినా మరే ఇతర ఇల్లయినా నేను నా సంప్రదాయాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు. నా జాతి వారసత్వం గురించి చాలా గర్వపడుతున్నాను. అందుకే, నా ఇంట్లో సంస్కృతికి సంబంధించిన ప్రతి అంశాన్ని స్పృశిస్తున్నాను. వాటిని సంబరంగా జరుపుకోవడానికి ఇష్టపడతాను. మన సంస్కృతి మరియు పెద్దల నీడలు మా ఇంట్లో వెచ్చదనాన్ని ఇస్తాయని ప్రగాఢంగా విశ్వసిస్తాను.
ఇల్లు అనేది బంధాల్ని పెంచుతుందని తెలిసిందే. అలాంటి వారితో కలిసి లాన్స్ రూములో కప్పు ఛాయ్ తాగితే ఎంత సంతోషమేస్తుంది. తనకు రంగురంగుల మొక్కలు, ఆకర్షణీయమైన బ్యాక్ యార్డ్ ఉండాలని కోరుకుంటున్నాను. అదే ఆమెకు అత్యంత ఇష్టమైన ప్రాంతమని చెప్పొచ్చు. షూటింగుల్లో బిజీ అవుతుండటం వల్ల హైదరాబాద్‌లో సొంతిల్లు కట్టుకోవాలని అనుకుంటున్నాను. అయితే, జీవితంలో కాస్త స్థిరపడి ఆర్థికంగా నిలదొక్కుకున్నాక.. కేరళలో ఒక కలల గృహాల్ని కట్టుకోవాలని ఉంది. విదేశాల్లో అయితే, సౌత్ ఫ్రాన్స్‌లో కొనాలని ఉంది.
This website uses cookies.