Categories: LATEST UPDATES

నిర్మాణ ప్రాంతాలకు పొల్యూషన్ రేటింగ్‌

రోజురోజుకూ పెరిగిపోతున్న కాలుష్యాన్ని నివారించేందుకు హర్యాణా సర్కారు కొత్త విధానం అమల్లోకి తెచ్చింది. కాలుష్యానికి సంబంధించి నిర్మాణ ప్రాంతాలకు రేటింగ్స్ ఇవ్వనుంది. దీనికి సంబంధించి 29 అంశాలను పారామీటర్లుగా చేసుకుని గరిష్టంగా 220 స్కోర్ ఇచ్చేలా హర్యాణా కాలుష్య నియంత్రణ మండలి ఓ ప్రణాళిక రూపొందించింది. 500 చదరపు మీటర్ల కంటే ఎక్కువగా ఉన్న సైట్లకు ఇది వర్తిస్తుంది. 25 నుంచి 55 మధ్యలో స్కోర్ వస్తే.. అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉందని నిర్ధారిస్తుంది. అలాగే 56 నుంచి 100 మధ్యలో వస్తే.. సంతృప్తికరం అని పేర్కొంటుంది. వెరీ గుడ్, ఎక్సలెంట్ అని మరో రెండు కేటగిరీలు ఇవ్వనుంది. 100 కంటే తక్కువ స్కోర్ వచ్చిన సైట్లకు నోటీసులు ఇచ్చి, అక్కడ కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచిస్తుంది. ఒకవేళ సరైన చర్యలు తీసుకోకుంటే జరిమానా వంటివి వసూలు చేస్తుంది. దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో కాలుష్య తీవ్రత ఎక్కువ కావడంతో హర్యాణా సర్కారు కాలుష్యాన్ని నివారించేందుకు ఈ చర్యలు చేపట్టింది.

This website uses cookies.