Categories: EXCLUSIVE INTERVIEWS

సౌతిండియాలో అతిపెద్ద గేటెడ్ క‌మ్యూనిటీ నిర్మిస్తున్నాం!

  • వాస‌వి గ్రూప్ సీఎండీ ఎర్రం విజ‌య్ కుమార్‌
  • ఎల్‌బీ న‌గ‌ర్‌లో ఆకాశ‌హ‌ర్మ్యం ఆరంభం
  • ఫ్లాట్ కొంటే ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ఉచితం

ఎన్నిక‌ల సంవ‌త్స‌ర‌మైనా అవ‌స‌ర‌మున్న వారు తప్ప‌కుండా త‌మ‌కు కావాల్సిన క‌ల‌ల గృహాన్ని ఎంచుకుంటార‌ని వాస‌వి గ్రూప్ ఎండీ ఎర్రం విజ‌య్ కుమార్ తెలిపారు. 2022లో హైద‌రాబాద్ నిర్మాణ రంగంలో చోటు చేసుకున్న అభివృద్ధి, మార్కెట్ స్థితిగ‌తుల‌పై ఆయ‌న రియ‌ల్ ఎస్టేట్ గురుకి ప్ర‌త్యేకంగా వివ‌రించారు. మౌలిక స‌దుపాయాల అభివృద్ధిలో తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకుంటున్న విప్ల‌వాత్మ‌క నిర్ణ‌యాల కార‌ణంగా హైద‌రాబాద్ రియాల్టీ గ‌ణ‌నీయంగా అభివృద్ధి చెందుతోంద‌ని అన్నారు. ఈ సంవ‌త్స‌రంలో త‌మ సంస్థ ప‌నితీరు మెరుగ్గా ఉంద‌న్నారు. నాణ్య‌మైన నిర్మాణాల్ని చేప‌ట్టే ప్రాజెక్టుల‌కే కొనుగోలుదారుల నుంచి మంచి మ‌ద్ధ‌తు ల‌భిస్తుంద‌ని తెలిపారు. ఇంకా ఏమ‌న్నారో ఆయ‌న మాట‌ల్లోనే..

ఇళ్ల కొనుగోలుదారుల‌కు కావాల్సింది న‌మ్మ‌కం. అందుకే, త‌మ‌కు అత్యంత విశ్వాసం గ‌ల సంస్థ‌ల్లోనే వీరంతా స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటారు. ఈ సంవ‌త్స‌రం మేం జీపీ ట్రెండ్స్‌, శ్రీనిల‌యం, ఉషారాణి ఇంటిగ్రా వంటి ప్రాజెక్టుల‌ను కొనుగోలుదారుల‌కు హ్యాండోవ‌ర్ చేస్తున్నాం. దాదాపు వ‌చ్చే ఏడాది చివ‌రిక‌ల్లా హ‌ఫీజ్‌పేట్‌లోని లేక్ సిటీ, సాలిటైర్ హైట్స్ వంటి నిర్మాణాల్ని బ‌య్య‌ర్ల‌కు అంద‌జేస్తాం. గ‌చ్చిబౌలి ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేప‌డుతున్న స్కైసిటీ కూడా పూర్తి చేస్తాం. మొత్తానికి, హైద‌రాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో మేం ప‌ది ప్రాజెక్టుల్ని నిర్మిస్తున్నాం. ఇందులో వ‌చ్చే ఫ్లాట్ల సంఖ్య‌.. దాదాపు ప‌ది వేల దాకా ఉంటాయి. అంతా లెక్కిస్తే.. సుమారు రెండున్న‌ర కోట్ల చ‌ద‌ర‌పు అడుగుల్లో నిర్మాణాల్ని చేప‌డుతున్నాం. వీటిని పూర్తి చేయ‌డానికి ఎంత‌లేద‌న్నా మూడు నుంచి నాలుగేళ్ల‌యినా ప‌డుతుంది. ప్ర‌స్తుతం మేం నిర్మాణాల్ని పూర్తి చేసే అంశం మీదే ఎక్కువ‌గా దృష్టి సారిస్తున్నాం.

ద‌క్షిణ హైద‌రాబాద్‌లోని అన్ని ప్రధాన న‌గ‌రాల్లో రియ‌ల్ రంగం మెరుగైన పురోగ‌తిని సాధిస్తోంది. చెన్నైలో స్టాలిన్ ముఖ్య‌మంత్రి అయ్యాక అక్క‌డి నిర్మాణ ప‌రిశ్ర‌మ గ‌ణ‌నీయంగా పుంజుకుంది. స్థిర‌మైన ప్ర‌భుత్వం, జీరో క‌ర‌ప్ష‌న్ కార‌ణంగా ప్లాట్లు, ఫ్లాట్ల అమ్మ‌కాలు మెరుగ్గానే జ‌రుగుతున్నాయి. బెంగ‌ళూరులో మార్కెట్ మెరుగు అవుతోంది. అక్క‌డ మాకు కొన్ని ల్యాండ్ పార్సిళ్లు ఉన్నాయి. కొత్త ప్రాజెక్టుల్ని ఆరంభించే విష‌య‌మై ఆలోచిస్తున్నాం. ఇప్ప‌టికే సుమ‌ధుర సంస్థ‌తో క‌లిసి కొన్ని నిర్మాణాల్ని చేప‌డుతున్నాం. ఇక హైద‌రాబాద్ విష‌యానికి వ‌స్తే.. ఇటీవ‌ల కాలంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ రాయ‌దుర్గం నుంచి శంషాబాద్ దాకా ఎయిర్‌పోర్టు మెట్రో రైలు ప‌నుల‌కు శంకుస్థాప‌న చేశారు. ఇది పూర్త‌యితే నార్సింగి, కిస్మ‌త్‌పూర్‌, అప్పా జంక్ష‌న్ వంటి ప్రాంతాల నుంచి మాదాపూర్, గ‌చ్చిబౌలి, ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్టుల‌కు క‌నెక్టివిటీ పెరుగుతుంది. దీని వ‌ల్ల ఈ ప్రాంతాల్లో నిర్మాణ రంగం పురోగ‌తి చెందుతుంది.
ద‌క్షిణ భార‌త‌దేశంలోనే అతిపెద్ద గేటెడ్ క‌మ్యూనిటీని హైద‌రాబాద్‌లోని ఎల్‌బీన‌గ‌ర్ ప్రాంతంలో నిర్మిస్తున్నాం. ఇందులో మొత్తం నాలుగు వేల ఫ్లాట్లను నిర్మిస్తాం. ఎన‌భై లక్ష‌ల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును చేప‌డుతున్నాం. ఒక్కో ట‌వ‌ర్ ఎత్తు సుమారు 34 అంత‌స్తుల దాకా ఉంటుంది. ఎల్‌బీ న‌గ‌ర్‌లోనే అత్యంత ఎత్తైన ట‌వ‌ర్లుగా ఈ ప్రాజెక్టు నిలుస్తుంది.

ఫ్లాట్ కొంటే.. ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ఉచితం

బాచుప‌ల్లిలోని వాస‌వి అర్బ‌న్‌లో రెండు ప‌డ‌క గ‌దుల ఫ్లాట్ కొంటే.. టీవీఎస్ ఐ క్యూబ్ ఎస్ స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూట‌ర్తో పాటు గోల్డ్ కాయిన్ కూడా అంద‌జేస్తాం. రెండు వారాల‌కోసారి నిర్వ‌హించే ల‌క్కీ డ్రాలో గోల్డ్ కాయిన్ కూడా గెల్చుకోవ‌చ్చు. 2023 మార్చి 22 నిర్వ‌హించే మెగా ల‌క్కీ డ్రాలో టాటా నెక్సాన్ ఈవీ కారును బంప‌ర్ బ‌హుమ‌తిగా గెల్చుకోవ‌చ్చు. మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఏమిటంటే, రూ. 44.5 ల‌క్ష‌ల విలువైన 875 చ‌ద‌ర‌పు అడుగుల ఫ్లాట్‌ను కేవ‌లం ప‌ది శాతం సొమ్మును క‌ట్టి బుక్ చేసుకోవ‌చ్చు. గృహ‌ప్ర‌వేశం చేశాకే మిగ‌తా సొమ్మును ఈఎంఐ రూపంలో చెల్లించొచ్చు.

This website uses cookies.