poulomi avante poulomi avante

హైదరాబాద్ అభివృద్ధికి ఢోకా లేదు

Poulomi Estates Director Prashant Rao 2023 Year Round Up Interview

POULOMI PALAZZO
POULOMI PALAZZO

రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం గణనీయమైన అభివృద్ధి సాధించింది. కోకాపేట, బుద్వేల్ వేలం పాటలే ఇందుకు నిదర్శనం. అయితే, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ ను ఓడించి, కాంగ్రెస్ కు అధికార పగ్గాలు అప్పగించారు. దీంతో కొన్ని రంగాల్లో ఉన్నవారు ఆందోళన చెందుతున్నారు. అలాంటి రంగాల్లో రియల్ ఎస్టేట్ కూడా ఒకటి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హయాంలో మన రియల్ భవితవ్యం ఎలా ఉండబోతోంది? అభివృద్ధిపథంలో దూసుకెళ్తుందా లేదా అనే అంశాలపై పౌలోమీ ఎస్టేట్స్ డైరెక్టర్ ప్రశాంత్ రావు రియల్ ఎస్టేట్ గురుతో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..

తెలంగాణలో ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇది చాలామంది ఊహించిందే. ప్రభుత్వం మారినంత మాత్రాన హైదరాబాద్ వ్యాపార విధానంలో పెద్దగా మార్పు కనిపించదు. ప్రధానంగా బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీతో పోలిస్తే.. మనదేశంలో అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పారామీటర్లు.. ప్రజలు ఇక్కడకు వచ్చి పని చేయడానికి, నివసించడానికి, పెట్టుబడులు పెట్టడానికి చక్కని వేదికగా చేశాయి. ఈ నేపథ్యంలో ఏ కొత్త ప్రభుత్వం వచ్చినా దానిని అలాగే ముందుకు తీసుకెళ్లడం చాలా సులభమవుతుంది. ఇంకో విషయం ఏమిటంటే.. కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రాజకీయాల్లోకి రాకముందు రియల్ ఎస్టేట్ డెవలపర్. అందువల్ల ఇది మా రియల్ వ్యాపారానికి ప్రయోజనం అని నేను భావిస్తున్నాను. పైగా ఈ వ్యాపారాన్ని ఆయన మరింత మెరుగ్గా అర్థం చేసుకుంటారు కాబట్టి, ఈ విషయంలో ఇంకా చురుగ్గా ఉంటారు. గతనెలలో పలు ఇంటర్వ్యూల్లో రియల్ ఎస్టేట్ ను తదుపరి స్థాయికి తీసుకెళ్లబోతున్నట్టు చెప్పారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే రాబోయే కొన్నేళ్లలో హైదరాబాద్ మరింత ఉన్నతస్థాయికి చేరుతుందని కచ్చితంగా అనుకుంటున్నాను.

 

వెస్ట్ ఈజ్ బెస్ట్..

వెస్ట్ హైదరాబాద్ ను అనేక ప్రభుత్వాలు అభివృద్ధి చేశాయి. చాలా సంవత్సరాల క్రితం టీడీపీ ప్రభుత్వం మాదాపూర్ లో హైటెక్ సిటీతో దీనిని ప్రారంభించగా.. తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సర్కారు ఓఆర్ఆర్ ద్వారా మరింత ఊపునిచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాజిక, మౌలిక సదుపాయాలు కల్పించడంతో చాలా కొత్త కంపెనీలు ఇక్కడకు వచ్చాయి. దీంతో ఈ ప్రాంతానికి డిమాండ్ బాగా పెరిగింది. ఇకపై కూడా హైదరాబాద్ అదే వృద్ధిని కొనసాగిస్తుంది. అయితే, గత ప్రభుత్వం మేడ్చల్, ఇతర ప్రాంతాలను కూడా ఐటీ కోసం అభివృద్ధి చేయడానికి ప్రయత్నించింది. కానీ వెస్ట్ హైదరాబాద్ కే ప్రాముఖ్యత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాబోయే కొన్నేళ్లలో ఈ ప్రాంతం మరింత మెరుగైన వృద్ది కొనసాగిస్తుందని అనకుంటున్నాను.

2023 బెస్ట్ ఇయర్..

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి 2023 ఉత్తమ సంవత్సరంగా ఉంది. నగరం ఆకర్షించిన పెట్టుబడులే కాకుండా కోవిడ్ లాక్ డౌన్ కాలంలో అనేక రోడ్లు వేయడంతో రియల్ ఎస్టేట్ రంగం మరింత వృద్ధి చెందింది. అలాగే లాక్ డౌన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రజలు మంచి ఇల్లు ఉండటం ఎంత ముఖ్యమో గ్రహించారు. దీంతో రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. హౌసింగ్ సెగ్మెంట్ లో కొత్త విభాగం ప్రారంభమైంది 2023లోనే. 2023కి ముందు 4వేల చదరపు అడుగుల వరకు మాత్రమే అపార్ట్ మెంట్లు ఉండేవి. ఇప్పుడు 6వేల నుంచి 15వేల చదరపు అడుగుల అపార్ట్ మెంట్లను కూడా బిల్డర్లు నిర్మిస్తున్నారు. కస్టమర్లు కూడా వాటిని సొంతం చేసుకుంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే రాబోయే రెండేళ్లు కూడా హైదరాబాద్ రియల్ వృద్ధి మరింతగా కొనసాగుతుందని అనుకుంటున్నాను.

 

నెమ్మదించిన ఐటీ..

ఐటీ సెగ్మెంట్ విషయానికి వస్తే.. 2023 సంవత్సరం.. మునుపటి సంవత్సరాలతో పోలిస్తే కాస్త నెమ్మదిగా ఉంది. కోవిడ్ వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. గత ఏడు నెలల్లో హైదరాబాద్ లో 6.5 మిలియన్ చదరపు అడుగుల ఐటీ స్థలం లీజుకు ఇచ్చారు. ఈ నేపథ్యంలో 2024 ఈ విషయంలో మరింత మెరుగ్గా ఉంటుందని, హైదరాబాద్ ఇంకా ఉన్నతస్థాయికి వెళుతుందని భావిస్తున్నాను.

మూడు ప్రాజెక్టులున్నాయ్..

ప్రస్తుతం మా దగ్గర మూడు ప్రాజెక్టులు నడుస్తున్నాయి. పౌలోమి అవంటే అనేది జీ ప్లస్ 22 అంతస్తుల మధ్యస్థాయి ప్రాజెక్టు. వచ్చేనెలలో అప్పగించడానికి సిద్ధంగా ఉంది. అలాగే జీ ప్లస్ 55 అంతస్తులతో 6వేల చదరపు అడుగుల నుంచి 8100 చదరపు అడుగుల ఫ్లాట్లతో కూడిన ప్రీమియం ప్రాజెక్టు పౌలోమి పలాజో నిర్మాణంలో ఉంది. బేస్ మెంట్లు పూర్తయ్యాయి. 2026 డిసెంబర్ నాటికి ఇది పూర్తవుతుంది. పౌలోమి ఇన్ఫినిటీ పేరుతో మరో గ్రేడ్ ఐటీ స్పేస్ కూడా ఉంది. కోకాపేట ప్రధాన రహదారిలో రానున్న ఈ ప్రాజెక్టు పది లక్షల చదరపు అడుగుల్లో నిర్మితం కానుంది. దీనిని కూడా రెండేళ్లలో పూర్తి చేస్తాం. మదీనాగూడలో జీ ప్లస్ 45 అంతస్తుల్లో ఒక ప్రాజెక్టు, మాదాపూర్లో మరో ప్రాజెక్టు చేపట్టబోతున్నాం. మేం బెంగళూరులో కూడా ప్రాజెక్టు చేపట్టాం. అక్కడ 9 ఎకరాల భూమి తీసుకున్నాం. 2023 కంటే 2024 మరింత మెరుగ్గా ఉంటుందని అనుకుంటున్నాను. 2024లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి కూడా బాగానే ఉంది. ఇక మన దేశంలో రియల్ ఎస్టేట్ రంగంలో అత్యంత దృష్టి కేంద్రీకరించిన ప్రాంతం హైదరాబాద్. ప్రతి ఒక్కరూ ఇక్కడకు వచ్చి పని చేయాలని, ఇక్కడ ఉండాలని కోరుకుంటారు. అందువల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మరింత ఉన్నత స్థాయికి వెళ్లడానికి ఈ అంశాలన్నీ దోహదపడతాయని భావిస్తున్నాను.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles