హైదరాబాద్లో ఇళ్లకు సంబంధించి కొనుగోళ్ల వాతావరణం తీసుకురావాలన్న ముఖ్య ఉద్దేశ్యంతో నిర్వహించిన ప్రాపర్టీ షో విజయవంతం అయ్యిందని ట్రెడా (తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్) అధ్యక్షుడు చలపతిరావు రాయుడు తెలిపారు. ప్రాపర్టీ షో చివరి రోజున ఆయన రియల్ ఎస్టేట్ గురుతో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. మూడు రోజుల ప్రాపర్టీ షోకు ఇరవై వేల మంది రావడమనేది సాధారణ విషయం కాదు. ఈసారి ప్రాపర్టీ షోలో సీరియస్ బయ్యర్లు మాత్రమే వచ్చారన్నారు.
మూడు రోజుల కార్యక్రమంలో దాదాపు ముప్పయ్ ఐదు వేల లీడ్లు జనరేట్ అయ్యాయని, ఐదు వందల మంది కొనుగోలుదారులు స్పాట్ లో బుకింగులు జరిపారని వెల్లడించారు. మొత్తానికి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎంతో సాఫీగా ఈ సంబురాలు సాగిందన్నారు.
This website uses cookies.