ఫేస్ బుక్ లో ఈ ప్రకటన చూస్తే ఎంత ముచ్చటేస్తుంది. బిల్డర్ ప్రేమికుల రోజు ప్రాముఖ్యత గురించి బాగా తెలిసినట్లు ఉంది. అదే రోజున బిల్డర్ అయ్యి ఉంటాడు. లేక ఫిబ్రవరి 14న అతని ప్రేమికురాలు ఫ్లాట్ ని బహుమతిగా అందజేసైనా ఉండాలి. అందుకే, ఎంచక్కా వ్యాలెంటైన్స్ డే సందర్భంగా ప్రత్యేక ఆఫర్ ని ప్రకటించాడు. అది కూడా ఈస్ట్ హైదరాబాద్లోనే ప్రత్యేక ఆఫర్ ని అందజేస్తున్నాడు.
చదరపు అడుక్కీ రూ.5000 ఉన్న ఫ్లాట్ రేటును ఏకంగా సగం తగ్గించేశాడు. కాకపోతే, ఈ నిర్మాణం ఎక్కడొస్తుంది? ఎప్పుడు ఆరంభిస్తారు? పూర్తి చేసేదెప్పుడు వంటి విషయాలేమీ ఈ ప్రకటనలో చెప్పలేదు. బిల్డర్ పేరు కూడా పేర్కొనలేదు. మరి, ఇలాంటి వివరాలేమీ లేకపోతే ప్రేమికులు ఇందులో ఫ్లాట్లను ఎలా కొనుగోలు చేస్తారు?