Categories: PROJECT ANALYSIS

హైదరాబాద్లో ప్రెస్టీజ్ మెగా టౌన్ షిప్

  • రాజేంద్ర నగర్ లో రూ.5వేల కోట్లతో అపార్ట్ మెంట్లు , విల్లాల నిర్మాణం

రియల్ రంగంలో సత్తా చాటుతున్న హైదరాబాద్ లో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు రాబోతోంది. ప్రెస్టీజ్ సంస్థ అతిపెద్ద టౌన్ షిప్ ను లాంచ్ చేయనుంది. రాజేంద్ర నగర్ లో రూ.5వేల కోట్లతో 6వేలకు పైగా అపార్ట్ మెంట్లు, విల్లాల నిర్మాణానికి ప్రెస్టీజ్ శ్రీకారం చుట్టనుంది. అగ్రికల్చర్ యూనివర్సిటీకి సమీపంలో ప్రెస్టీజ్ సిటీ హైదరాబాద్ పేరుతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో అందరికీ అందుబాటులో ఉండేలా 1బీహెచ్ కే, 2 బీహెచ్ కే, 3 బీహెచ్ కే, 4 బీహెచ్ కే ఇళ్లను నిర్మించనుంది. బెంగళూరు, ముంబైలో విజయవంతంగా ప్రాజెక్టులు లాంచ్ చేసిన ప్రెస్టీజ్.. ఇప్పుడు హైదరాబాద్ లో ఈ ప్రాజెక్టు చేపట్టింది. 64 ఎకరాల స్థలంలో 13 టవర్లలో 6647 అపార్ట్ మెంట్లు నిర్మిస్తారు.

ఇందుకు 9.5 మిలియన్ చదరపు అడుగుల స్థలం అవసరం అవుతుంది. అలాగే 119 విల్లాలను 0.8 మిలియన్ చదరపు అడుగుల భూమిలో నిర్మిస్తారు. అలాగే 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రిటైల్ మాల్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. బెంగళూరు, ముంబై తర్వాత రియల్ రంగంలో హైదరాబాద్ దూసుకెళ్తోందని.. అందుకే తాము హైదరాబాద్ లో ప్రెస్టీజ్ సిటీ హైదరాబాద్ ప్రాజెక్టు చేపట్టామని సంస్థ సీఈఓ వెంకట్ కె నారాయణ తెలిపారు. రెండు నెలల్లో ఈ ప్రాజెక్టును లాంచ్ చేయనున్నట్టు వెల్లడించారు. కాగా, ప్రెస్టీజ్ సంస్థ దేశవ్యాప్తంలో 12 నగరాల్లో ఇప్పటివరకు 280 ప్రాజెక్టులు పూర్తి చేసింది. హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడ, ఖానాపూర్, హైటెక్ సిటీ, కోకాపేట, శంషాబాద్, రాజేంద్రనగర్ లలో ఈ సంస్థవి 8 ప్రాజెక్టులున్నాయి.

This website uses cookies.