Categories: LATEST UPDATES

ప్రాప్ టెక్ చాలెంజ్ విజేత.. స్ట్రాక్చర్

  • మొదటి రన్నరప్ గా ఎన్ లైట్.. రెండో రన్నరప్ గా సూపర్ బోల్టర్
  • సీబీఆర్ ఈ ప్రకటన

ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థ సీబీఆర్ఈ సౌత్ ఏసియా ప్రైవేట్ లిమిటెడ్ ఇటీవల నిర్వహించిన భారతదేశపు అతిపెద్ద ప్రాప్ టెక్ చాలెంజ్ ‘డిస్ రప్ టెక్ 2.0’ విజేతలను ప్రకటించింది. ఇందులో ఢిల్లీకి చెందిన స్ట్రాక్చర్ విజేతగా నిలవగా.. ముంబైకి చెందిన ఎలైట్, బెంగళూరుకు చెందిన సూపర్ బోల్టర్ మొదటి, రెండో రన్నరప్ లుగా నిలిచాయి. ఆరునెలల పాటు సాగిన ఈ చాలెంజ్ లో దేశవ్యాప్తంగా 45 నగరాల నుంచి 400 కంటే ఎక్కువ స్టార్టప్ లు పాల్గొన్నాయి.

స్థానిక మార్కెట్ కోసం ఈఎస్ జీ, ఫిన్ టెక్, నిర్మాణ సాంకేతికత, స్వదేశీ టెక్ లు అనే కేటగిరీలుగా విభజించి ఎంట్రీలు స్వీకరించారు. ఫిన్ టెక్ నుంచి అధిక సంఖ్యలో నామినేషన్లు వచ్చాయి. తర్వాత ఈఎస్ జీ ఉంది. రియల్ రంగంలో నిపుణులతో కూడిన ప్రముఖ ప్యానెల్ 11 మంది ఫైనలిస్టులను ఎంపిక చేసింది. ముగ్గురు విజేతలకు జీ20 షెర్పా ఆఫ్ ఇండియా, నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్, సీబీఆర్ఈ ఇండియా సీఈఓ అన్షుమన్ మేగజైన్ బహుమతులు ప్రదానం చేసి వారిని అభినందించారు.

This website uses cookies.