Categories: CONSTRUCTION

5 రోజుల్లో ఇల్లు పూర్తి.. త్రీ డీ హౌస్

  • ప్రప్రథమ త్రీ డీ హౌస్ సిద్ధం
  • మద్రాస్ ఐఐటీ స్టార్టప్ ‘త్వస్థ’ నిర్మాణం
  • ప్రశంసించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

భారతదేశంలోనే ప్రప్రథమ త్రీడీ ప్రింటెడ్ హౌజ్ సిద్ధమైంది. ఇది మద్రాస్ ఐఐటీ స్టార్టప్ కంపెనీ త్వస్థ ఆలోచన నుంచి రూపుదిద్దుకుంది. ఈ ఇంటి ప్రత్యేకత ఏమిటంటే.. సాఫ్ట్ వేర్ సాయంతో ఇంటిని డిజైన్ చేయగా.. కాంక్రీట్ త్రీ డీ ప్రింటింగ్ టెక్నాలజీ సాయంతో ప్రింట్ చేశారు. ఆరు వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఇంట్లో బెడ్ రూమ్, హాల్, కిచెన్ వంటి వాటిని పొందుపర్చారు. సాధారణ పద్ధతిలో ఒక ఇంటిని కట్టేందుకు నాలుగు నుంచి ఐదు నెలలు పడితే.. ఈ పరిజ్నానం సాయంతో ఐదు నెలల్లోపే పూర్తి చేశారు. పైగా ఇంటి నిర్మాణ ఖర్చు సుమారు ముప్పయ్ శాతం తగ్గగా.. నిర్మాణం కనీసం యాభై ఏళ్ల దాకా చెక్కు చెదరదు.

కాంక్రీట్ 3 డి ప్రింటింగ్ అనేది ఆటోమెటిగ్గా వాస్తవిక నిర్మాణాల్ని నిర్మించే విధానమని చెప్పొచ్చు. మనం కోరుకున్న అన్ని సైజుల్లో నచ్చిన ఇంటిని నిర్మించుకోవచ్చు. త్రీ డీ కాంక్రీటు ప్రింటర్ ముందుగా త్రీ డైమెన్షన్ డిజైన్ ను ఖరారు చేస్తుంది. ఆ తర్వాత ఒక్కో లేయర్ ను కాంక్రీటు సాయంతో నిర్మిస్తుంది. ఈ సందర్భంగా ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ భాస్కర్ రామమూర్తి మాట్లాడుతూ.. రైతులకు బోర్లు అద్దెకిచ్చినట్లే ఈ ఇళ్లను కిరాయికి ఇవ్వవచ్చని తెలిపారు. భారీ స్థాయిలో చేపడితే నాణ్యతో కట్టవచ్చన్నారు. ఈ టెక్నాలజీ సాయంతో భారతదేశంలోని అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరలో ఇళ్లను నిర్మించి ఇవ్వొచ్చని త్వస్థ సీఈవో ఆదిత్యా వీఎస్ తెలిపారు.

2022 నాటికి పది కోట్ల ఇళ్లు..

అతి తక్కువ కాలంలో ఇళ్లను నిర్మించే ఆధునిక విధానాలు ప్రస్తుతం మనదేశానికెంతో అవసరమన్నారు. సంప్రదాయ పద్ధతిలో నిర్మిస్తే ఎక్కువ సమయం పడుతుందని.. ఈ విధానంలో ఐదు రోజులకొకసారి ఇళ్లను కట్టగలిగితే.. 2022 నాటికి పది కోట్ల ఇళ్లను కట్టడం కష్టమేం కాదని అభిప్రాయపడ్డారు. – నిర్మలా సీతారామన్, ఆర్థిక మంత్రి

This website uses cookies.