రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు రుణాలిచ్చే విషయంలో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా తాజాగా విడుదల చేసిన ముసాయిదా నిబంధనలు దేశంలో ఇన్ ఫ్రా అభివృద్ధి వేగాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని కంపెనీలు పేర్కొంటున్నాయి. అయితే, దీర్ఘకాలిక స్థిరత్వం కోణంలో ఆలోచిస్తే ఇది వివేకవంతమైన చర్య అని ప్రశంసిస్తున్నాయి. రియల్ ప్రాజెక్టులకు రుణాల విషయంలో స్టాండర్డ్ అసెట్ ప్రొవిజన్ ను 5 శాతం పెంచాలని ప్రతిపాదించిన నిబంధనలు సంచలనం సృష్టించాయి. దీనిపై ఆర్బీఐకి లేఖ రాయాలని వాణిజ్య బ్యాంకులు యోచిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాబోయే దశాబ్ద కాలానికి ఉద్దేశించిన ఇన్ ఫ్రా డెవలప్ ప్రాజెక్టులకు ఇది అడ్డంకిగా మారుతుందని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు.
అధిక కేటాయింపులు బ్యాంకర్లకు ఒత్తిడి కలిగిస్తాయని, అందువల్ల బ్యాంకులకు ఇది ప్రాధాన్యతా రంగంగా ఉండదని పేర్కొంటున్నారు. దీంతో రియల్ రంగంపై ప్రభావం పడుతుందని విశ్లేషిస్తున్నారు. అలాగే పెట్టుబడుల ప్రవాహాన్ని ప్రభావితం చేయడంతోపాటు ప్రాజెక్టుల ఆలస్యానికి కారణమయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అయితే, స్థిరాస్తి రంగా దీర్ఘకాలిక స్థిరత్వానికి ఇది దోహదపడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పుడు చేపట్టిన ప్రాజెక్టులు ప్రస్తుతం నిబంధనల ప్రకారం మొదలైన నేపథ్యంలో ఈ ముసాయిదా నిబంధనలను నిర్దేశిత టైమ్ లైన్ ప్రకారం అమలు చేయాలని సూచిస్తున్నారు.
This website uses cookies.