- నానక్‌రాంగూడలో ఎస్ అండ్ ఎస్ గ్రీన్ గ్రేస్
- ప్రప్రథమ గ్రీన్ గేటెడ్ కమ్యూనిటీ
- ట్రిపుల్ బెడ్‌రూం ఫ్లాట్లు లభ్యం
హైదరాబాద్‌లో అంతగా ప్రాచుర్యం పొందని ప్రాంతాల్లోనే కొన్ని సంస్థలు చదరపు అడుక్కీ రూ.పది వేల నుంచి పద్నాలుగు వేల దాకా ఫ్లాట్లను విక్రయిస్తున్నాయి. కానీ, అంతకంటే అత్యుత్తమ లొకేషన్‌లో.. ఐటీ, ఫైనాన్షియల్ సంస్థలకు కూతవేటు దూరంలో.. హరిత సూత్రాలకు అనుగుణంగా.. ప్రశాంతమైన వాతావరణంలో రెడీ టు ఆక్యుపై గల హైరైజ్ గ్రీన్ గేటెడ్ కమ్యూనిటీ అయిన ఎస్ అండ్ ఎస్ గ్రీన్ గ్రేస్ లో మాత్రం అంతకంటే తక్కువ రేటుకే ఫ్లాట్లు లభిస్తున్నాయి.
గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే.. రెడీ టు ఆక్యుపై ప్రాజెక్టే.. ఎస్ అండ్ ఎస్ గ్రీన్ గ్రేస్. జి+ 14 అంతస్తుల ఎత్తులో ట్రిపుల్ బెడ్‌రూం ఫ్లాట్లు, అది కూడా 2,400 కంటే ఎక్కువ విస్తీర్ణం గల ఫ్లాట్లు ఉన్నాయి. కాస్త బడా సైజులో కావాలనుకునే వారికి.. మూడు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రీమియం ఫ్లాట్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
గ్రీన్ బిల్డింగ్ సూత్రాలకు అనుగుణంగా ఎస్ అండ్ ఎస్ గ్రీన్ గ్రేస్‌ను తీర్చిదిద్దడంలో డెవలపర్ మేకా విజయ్ సాయి ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఖర్చుకు అసలేమాత్రం వెనుకాడకుండా.. బయ్యర్లకు ద బెస్ట్ ప్రాజెక్టును అందజేశారు. ప్రతి ఫెసిలిటీని అందజేయడంలో ఆయనెంతో పరిశోధన చేసి నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాజెక్టులో ఫ్లాట్లు కొన్నవారంతా హ్యాపీగా ఫీల్ అవ్వడానికి ప్రధాన కారణమిదే.
హరిత సూత్రాలకు అనుగుణంగా లగ్జరీ జీవితాన్ని ఆస్వాదించాలని భావించేవారికి ఎస్ అండ్ ఎస్ గ్రీన్ గ్రేస్ పక్కాగా నప్పుతుంది. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కు పెద్ద పీట వేశారు. 300 అడుగుల లోతు వరకూ తవ్వి.. ప్రత్యేకంగా పైపులేసి భూగర్భజలాలు నిల్వ అయ్యేలా చేశారు. వర్షపు నీరు నిల్వ చేసేందుకు దాదాపు 2 లక్షల లీటర్ల సామర్థ్యం గల ప్రత్యేక ట్యాంకును ఏర్పాటు చేశారు. వెయ్యి చదరపు అడుగుల్లో జపనీస్ మినీ అర్బన్ ఫారెస్టును డెవలప్ చేశారు.
ప్రతి టవరులో నలభై వేల లీటర్ల సోలార్ వాటర్ హీటర్ అందేలా ఏర్పాటు చేశారు. అధిక శాతం ఎల్ఈడీ లైట్లను వినియోగించారు. వీ3ఎఫ్ టెక్నాలజీ గల లిఫ్టులను వినియోగించారు. ఎస్టీపీ ట్యాంకును ఏర్పాటు చేయడం వల్ల ఫ్రెష్ వాటర్ మీద ఆధారపడటం 30 శాతం తగ్గింది. అంతెందుకు తక్కువ కాలుష్యాన్ని వెదజల్లే రంగుల్ని వినియోగించారు. మొత్తానికి, ఎస్ అండ్ ఎస్ గ్రీన్ గ్రేస్‌లో నివసించడమంటే.. జీవనాన్ని ఆనందమయం చేసుకోవడమేనని సంస్థ ఎండీ మేకా విజయ్ సాయి అభిప్రాయపడ్డారు.