తెలంగాణలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడినప్పటికీ.. పలు రియల్ ఎస్టేట్ వెంచర్లలో ప్లాట్ల అమ్మకాలు పెరగట్లేదు. సుమారు మూడు నెలల్నుంచి మార్కెట్లో సేల్స్ లేకపోవడంతో పరిస్థితి దారుణంగా తయారైంది. ఫార్మా సిటీ, ఎయిర్ పోర్టు మెట్రో కారిడార్ రద్దు కావడంతో ప్లాటింగ్ మార్కెట్‌లో ప్రతికూల వాతావరణం ఏర్పడింది. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తుండటంతో.. అక్కడ ప్రభుత్వం గనక మారిపోతే.. రియల్ రంగానికి మళ్లీ డిమాండ్ పెరుగుతుందని కొందరు పెట్టుబడిదారులు భావిస్తున్నారు. అందుకే, అనేకమంది ఇన్వెస్టర్లు.. కొంతకాలం పాటు వేచి చూసే ధోరణీని అలవర్చుకున్నారని రియల్ నిపుణులు అంటున్నారు.
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం మారినట్లే.. ఆంధ్రలోనూ కొత్త ప్రభుత్వం ఏర్పడితే.. రియల్ ఎస్టేట్ రంగానికి డిమాండ్ ఏర్పడుతుందని.. అక్కడి ప్లాట్లు, ఫ్లాట్ల ధరలు పెరుగుతాయని.. అనేకమంది ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ఫలితంగా, హైదరాబాద్ వెంచర్లలో ప్లాట్లు కొనేవారి సంఖ్య గణనీయంగా తగ్గింది. అమ్మకాలు పెద్దగా లేకపోవడంతో రియల్టర్లలోనూ నీరసం ఏర్పడింది. ఇలాంటి పరిస్థితి ఇంకెంత కాలం కొనసాగుతుందో తెలియక.. కొందరు ప్రమోటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణలో ఎన్నికలు ప్రకటించినప్పటి నుంచి ప్లాట్లను కొనడానికి ఎవరూ పెద్దగా ఉత్సాహం చూపెట్లడం లేదని కొందరు రియల్ వ్యాపారులు రియల్ ఎస్టేట్ గురుకి తెలిపారు.
This website uses cookies.