poulomi avante poulomi avante

రిటైల్ లీజింగ్ సూపర్

  • 2024లో 6.4 మిలియన్ చదరపు అడుగలు కార్యకలాపాలు
  • సీబీఆర్ఈ నివేదిక వెల్లడి

దేశవ్యాప్తంగా రిటైల్ లీజింగ్ తన సత్తా చాటింది. ఎనిమిది ప్రధాన నగరాల్లో 2024 కేలండర్ సంవత్సరంలో 6.4 మిలియన్ చదరపు అడుగుల రిటైల్ లీజింగ్ కార్యకలాపాలు నమోదయ్యాయి. అలాగే ఈ నగరాల్లో సరఫరా 1.2 మిలియన్ చదరపు అడుగులుగా ఉందని ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ తన తాజా నివేదికలో వెల్లడించింది. 2025లో రిటైల్ సరఫరా ఎక్కువగానే ఉండబోతోందని పేర్కొంది. 2024లో రిటైల్ లీజింగ్ లో ఫ్యాషన్, అపెరల్స్ హవా కొనసాగింది. మొత్తం లీజింగ్ లో వీటివాటా 37 శాతంగా ఉంది. హోంవేర్, డిపార్ట్ మెంట్ స్టోర్స్ 13 శాతం, ఫుడ్ అండ్ బేవరేజెస్ 12 శాతం వాటాతో ఉన్నాయి. 2024 ద్వితీయార్థంలో టైర్-1 నగరాల్లో రిటైల్ స్పేస్ లీజింగ్ 3.2 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది.

ఇందులో బెంగళూరు టాప్ లో ఉండగా.. హైదరాబాద్, ఢిల్లీలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2024 ద్వితీయార్థంలో మొత్తం రిటైల్ స్పేస్ లీజింగ్ లో ఈ మూడు నగరాల వాటా 58 శాతం కావడం గమనార్హం. ఈ కాలంలో నగరాలవారీగా వివరాలు చూస్తే.. బెంగళూరు 0.7 మిలియన్ చదరపు అడుగుల రిటైల్ స్పేస్ లీజింగ్ తో తొలి స్థానంలో ఉంది. ఇక్కడ ఫ్యాషన్, అపెరల్స్ వాటా 39 శాతం కాగా, వినోదరంగం 20 శాతం, ఫుడ్ అండ్ బేవరేజెస్ 15 శాతం వాటాతో ఉన్నాయి. హైదరాబాద్ విషయానికి వస్తే.. 0.6 మిలియన్ చదరపు అడుగుల రిటైల్ స్పేస్ లీజింగ్ జరిగింది.

ఇక్కడ ఫ్యాషన్, అపెరల్ వాటా 37 శాతం కాగా, హైపర్ మార్కెట్ 28 శాతం, లగ్జరీ 9 శాతంగా నమోదైంది. ఢిల్లీలో 0.6 మిలియన్ చదరపు అడుగుల లీజింగ్ జరగ్గా.. ముంబైలో 0.5 మిలియన్ చదరపు అడుగుల లీజింగ్ నమోదైంది. చెన్నైలో 0.3 మిలియన్ చదరపు అడుగులు, పుణెలో 0.3 మిలియన్ చదరపు అడుగులు, అహ్మదాబాద్ లో 0.2 మిలియన్ చదరపు అడుగులు, కోల్ కతాలో 0.1 మిలియన్ చదరపు అడుగుల రిటైల్ లీజింగ్ జరిగింది.

spot_img
Hallmarkinfracon imperia

Hot Topics

Related Articles