50 నగరాల్లో 7.1 శాతం మేర పెరుగుదల
దేశవ్యాప్తంగా ప్రాపర్టీ ధరలు పెరుగుతున్నాయి. గత త్రైమాసికంలో దేశంలోని 50 నగరాల్లో స్తిరాస్థి ధరలు 7.1 శాతం మేర పెరిగాయని నేషనల్ హౌసింగ్ బ్యాంకు (ఎన్ హెచ్ బీ) విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. 2022 డిసెంబర్ 31తో మూడో త్రైమాసికంలో ఈ ధరలు 7.1 శాతం పెరిగాయని ఎన్ హెచ్ బీ పేర్కొంది. వార్షికంగా చూస్తే.. 44 నగరాల్లో ప్రాపర్టీ ధరలు పెరగ్గా.. 6 నగరాల్లో తగ్గుదల కనిపించింది. అత్యధికంగా గాంధీనగర్లో 21.4 శాతం పెరుగుదల నమోదు కాగా, లూధియానాలో 11.6 శాతం పెరుగుదల కనిపించింది. ఇక దేశంలో ఎనిమిది ప్రధాన నగరాలైన అహ్మదాబాద్ (14.4%), హైదరాబాద్ (10.2%), చెన్నై (8.7%), బెంగళూరు (8%), కోల్ కతా (7.4%), పుణె (7.2%), ముంబై (4.4%), ఢిల్లీ (1.8%) పెరిగాయి.
This website uses cookies.