నటుడు షాహిద్ కపూర్ ముంబై వర్లీలోని ఒబెరాయ్ 360 వెస్ట్ ప్రాజెక్టులో ఓ ఫ్లాట్ కొనుగోలు చేశారు. 5,614 చదరపు అడుగుల ఫ్లాట్ ను రూ.58.66 కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్నారు. టవర్ బి లోని 24 అంతస్తులో ఈ ఫ్లాట్ ఉంది. తన భార్య మీరాతో కలిసి చందక్ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి దీనిని కొనుగోలు చేశారు. స్టాంపు డ్యూటీ కింద రూ.1.75 కోట్లు చెల్లించారు. మే 24న ఈ రిజిస్ట్రేషన్ జరిగింది. ఫ్లాట్ తో పాటు మూడు కారు పార్కింగ్ స్పేస్ లు లభిస్తాయి.
కాగా, గతేడాది ఏప్రిల్ తో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్ లో ముంబై మెట్రొపాలిటన్ రీజియన్ లో రిజిస్ట్రేషన్ల సంఖ్యలో 16 శాతం పెరుగుదల నమోదైంది. ఈ ఏప్రిల్ లో ముంబై రీజియన్ లో 11,504 యూనిట్లు రిజిస్టర్ అయ్యాయి. తద్వారా ఖజానాకు రూ.1,043 కోట్ల ఆదాయం సమకూరింది. మొత్తం రిజిస్ట్రేషన్ అయిన యూనిట్లలో 500 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న ఇళ్ల వాటా 45 శాతంగా ఉంది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది 5 శాతం ఎక్కువ.