ఒప్పందం ప్రకారం నిర్మాణాలు పూర్తి చేసి ఫ్లాట్లను అప్పగించకపోవడంతో కొనుగోలుదారులు చెల్లించిన మొత్తాలను 9 శాతం వడ్డీతో సహా చెల్లించాలని Aliens Developers ఏలియన్స్ డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్, దాని ఎండీ హరి చల్లాకు రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఖర్చుల కింద రూ.5,000 అదనంగా చెల్లించాలంటూ ఇటీవల తీర్పును వెలువరిచింది. కేసు పూర్వాపరాల్లోకి వెళితే..
మెదక్ జిల్లా రామచంద్రాపురం మండలం తెల్లాపూర్లో ఏలియన్స్ స్పేస్ స్టేషన్-1 లో మహారాష్ట్రకు చెందిన తండ్రీ కొడుకులు నిర్భయ్ కుమార్ షా, అభిషేక్ కుమార్లు వేర్వేరుగా ఫ్లాట్లు కొనుగోలు చేసి 2009లో ఒప్పందం చేసుకున్నారు. తండ్రి నిర్భయ్ కుమార్ షా రూ.37.03 లక్షలకు గాను రూ..18.51 లక్షలు.. అభిషేక్ కుమార్ షా రూ.38.73 లక్షలకు గాను రూ.15.87 లక్షలు చెల్లించారు. 2012లో ఫ్లాట్లను అప్పగించాల్సి ఉండగా.. వాటిని అప్పగించకపోవడంతో 2018లో నోటీసులు జారీ చేసి తమ సొమ్ము వాపసు ఇవ్వాలని అభ్యర్థించినా ఫలితం లేకపోవడంతో వారు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. తాము చెల్లించిన సొమ్మును 24 శాతం వడ్డీతో పాటు నష్ట పరిహారంగా రూ.10 లక్షలు, ఒప్పందం ప్రకారం అద్దె సొమ్ము చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
This website uses cookies.