Categories: PROJECT ANALYSIS

హైదరాబాద్లో ‘సుమధుర’ ప్రాజెక్టులు

  • అత్యున్నత ప్రమాణాలతో సుమధుర గ్రూప్ ప్రాజెక్టులు
  • తాజాగా శంషాబాద్ గగన్ పహాడ్ లో కొత్త ప్రాజెక్టు లాంచ్

సుమధుర గ్రూప్ బెంగళూరు, హైదరాబాద్ లలో ల్యాండ్ మార్కులు సృష్టిస్తోంది. ప్రీమియర్ ప్రాపర్టీస్ లో దాదాపు 7 వేలకు పైగా కుటుంబాలకు సుమధుర ఇన్ ఫ్రాకన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ హోమ్ మేకర్ అయ్యింది. గత 25 ఏళ్లుగా సుమధుర విజయ సంతకం అనేక విలువల చుట్టూ కేంద్రీకృతమై ఉందని వ్యాఖ్యానించింది.

విలాసవంతమైన హౌసింగ్ ప్రాజెక్టులను నిర్ణీత సమయానికి అందించడమే కాకుండా నాణ్యత విషయంలో రాజీ పడకుండా నిజాయతీ ధరలకు అందించగల సామర్థ్యం సుమ‌ధుర సంస్థ‌ సొంతం. సరైన ప్రదేశంలో భూమిని సేకరించడంలో నైపుణ్యం, సృజనాత్మకతతో కూడిన ఆర్కిటెక్చర్, ప్రీమియం బ్రాండ్ లను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవడం, కొనుగోలుదారుల ఆకాంక్షలకు అనుగుణమైన ఇంటీరియర్స్, అమ్మకం తర్వాత కూడా సేవలు అందించడం వంటి అంశాలు సంస్థ‌కు మంచి పేరు తీసుకొచ్చాయి. త‌మ నిర్మాణాల ద్వారా కొనుగోలుదారుల‌కు ఆనందాన్ని పంచిస్తామ‌ని సుమ‌ధుర చెబుతోంది.

సుమ‌ధుర అక్రోపోలిస్‌..

విలువలలో రాజీ పడకుండా అన్ని కట్టుబాట్లనూ పాటిస్తూ ముందుకు వెళుతోందీ సంస్థ‌. నిర్మాణాలన్నీ స్థానిక సందర్భం, సంస్కృతి, ఆకాంక్షలకు అనుగుణంగానే ఉంటున్నాయి. ఇప్పటివరకు 45కి పైగా ప్రాజెక్టులు పూర్తి చేసింది. 8 మిలియన్ చదరపు అడుగుల నిర్మాణాలు పూర్త‌య్యాయి. ప్ర‌స్తుతం 20 మిలియన్ చదరపు అడుగుల నిర్మాణాల పనులు జరుగుతున్నాయి. 2016లో హైదరాబాద్ నానక్ రామ్ గూడ లో ‘సుమధుర అక్రోపొలిస్‘ పేరుతో జీ ప్లస్ 31 అంతస్తుల హై లగ్జరియస్ ప్రాజెక్టుతో అడుగుపెట్టింది. అత్యున్నత ప్రమాణాలతో నిర్మించిన ఈ ప్రాజెక్టు ముందుగా చెప్పిన ప్రకారం 2019 నాటికి విజయవంతంగా పూర్తి చేసింది.

ప్రస్తుతం కొండాపూర్ మసీదుబండ వద్ద ‘సముధుర హారిజన్’ పేరుతో 18 అంతస్తుల ప్రాజెక్టు నిర్మిస్తోంది. వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి ఇది పూర్తవుతుంది. గతేడాది ఆగస్టులో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నానక్ రామ్ గూడలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ‘సముధుర ద ఒలింపస్’ పేరుతో 44 అంతస్తుల నిర్మాణం చేప‌ట్టింది. ఏడు నెలల కంటే తక్కువ వ్యవధిలోనే దాదాపు 50 శాతం ఫ్లాట్లను విక్రయించారు. శంషాబాద్ గగన్ పహాడ్ లో ‘సుమధుర గార్డెన్స్ బై ది బ్రూక్’ (జీ ప్లస్ 14 అంతస్తుల) ప్రాజెక్టు తాజాగా రెరా అనుమతి తీసుకుని లాంచ్ చేశారు. సుమధుర గ్రూప్.. గ్రేడ్ ఏ కమర్షియల్ అండ్ వేర్ హౌసింగ్ లోకి అడుగుపెట్టింది.

This website uses cookies.