Categories: LATEST UPDATES

అప్ప‌గింత ఆలస్యం.. 1750 ప్రాజెక్టుల రిజిస్ట్రేషన్ల నిలిపివేత

ప్రాజెక్టు అప్పగింతలో ఆలస్యం కారణంగా 1750 రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల బ్యాంకింగ్ లావాదేవీలు, ప్రకటనలు, మార్కెటింగ్, రిజిస్ట్రేషన్, అమ్మకాలు జరపకుండా మహారాష్ట్ర రెరా నిర్ణయం తీసుకుంది. ఆ 1750 రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల రిజిస్ట్రేషన్ చేయకుండా తాత్కాలికంగా నిలిపివేసినట్టు పేర్కొంది. వీటిలో 761 ప్రాజెక్టులు ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ లో ఉండగా.. పుణెలో 628 ప్రాజెక్టులు ఉన్నాయి. అలాగే మరో 1137 రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను తాత్కాలికంగా నిలిపివేసే చర్యలు ప్రారంభించినట్టు మహారెరా పేర్కొంది. ఆయా ప్రాజెక్టుల్లో ఎలాంటి బ్యాంకింగ్ లావాదేవీలు, ప్రకటనలు, మార్కెటింగ్, రిజిస్ట్రేషన్, అమ్మకాలు జరపడానికి వీల్లేదని స్పష్టం చేసింది.

ఈ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు కొనుగోలుదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. రెరా నిబంధనల ప్రకారం ప్రాజెక్టు ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు అన్ని వివరాలను కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచాలి. ఈ అంశంలో మహా రెరా కచ్చితంగా వ్యవహరిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ కంప్లయెన్స్ సెల్ ఏర్పాటు చేసి, అన్ని ప్రాజెక్టులను సమగ్రంగా పరిశీలిస్తోంది. ఈ క్రమంలోనే అప్పగింతలో ఆలస్యం జరిగిన 1750 ప్రాజెక్టుల రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది.

This website uses cookies.