భవన పునర్నిర్మాణాన్ని వారు అడ్డుకోలేరు
బాంబే హైకోర్టు స్పష్టీకరణ
ఇళ్లలో అద్దెకు ఉండేవారి హక్కులు పరిమితమేనని, అవి యజమానుల హక్కులను మించి ఉండవని బాంబే హైకోర్టు స్పష్టంచేసింది. యజమాని తన ఇంటికి మరమ్మతులు చేయాలనుకున్నా.. పునర్నిర్మాణం చేయాలనుకున్నా అద్దెదారులు అడ్డుకోలేరని పేర్కొంది. అద్దెదారులకు కొన్ని హక్కులు ఉన్నప్పటికీ, అవి పరిమితమేనని తేల్చి చెప్పింది. ముంబై వర్లీలో ఓ వ్యక్తి ఇంట్లో అద్దెదారు ఉంటున్నారు. ఈ క్రమంలో తన ఇంటికి మరమ్మతులు నిర్వహించాలని ఆయన భావించారు. అందుకోసం అద్దెదారును ఖాళీ చేయించి, ఇంటి మరమ్మతులు చేయించాలనుకున్నారు. అవి పూర్తయిన తర్వాత మళ్లీ ఆ అద్దెదారుకే ఇల్లు ఇవ్వాలనుకున్నారు. అయితే, తాము ఇల్లు ఖాళీ చేయకుండానే మరమ్మతులు నిర్వహించొచ్చని సదరు అద్దెదారు వాదించారు. ఈ మేరకు ముంబై సివిక్ చీఫ్ నుంచి అనుమతి కూడా తీసుకొచ్చారు. దీనిని ఆ ఇంటి యజమాని హైకోర్టులో సవాల్ చేశారు. దీనిని విచారించిన ధర్మాసనం అద్దెదారుల హక్కులు పరిమితమేనని పేర్కొంది.
This website uses cookies.