- అది చూసి పెట్టుబడి పెట్టి మోసపోకండి
- కొనుగోలుదారులకు రెరా హెచ్చరిక
ఇళ్ల కొనుగోలుదారులు మోసపోకుండా చూడటంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న యూపీ రెరా తన దూకుడు కొనసాగిస్తోంది. ఓ సంస్థకు చెందిన వాణిజ్య ప్రకటన మోసపూరితమని, ఎవరూ దానిని నమ్మి పెట్టుబడులు పెట్టొద్దని హెచ్చరించింది. సర్వోత్తమ్ వరల్డ్ పేరుతో వస్తున్న ప్రకటన మోసమని, ఈ ప్రాజెక్టులో ఎవరూ పెట్టుబడి పెట్టి మోసపోవద్దని సూచించింది. ‘మెగాపోలిస్, సర్వోత్తమ్ మెగాపోలిస్ పేరుతో హైటెక్ టౌన్ షిప్ న్యూయోయిడాలో ప్రాజెక్టు వస్తోందంటూ సర్వోత్తమ్ వరల్డ్ పేరుతో అన్ని మీడియా, రేడియో, డిజిటల్ ప్లాట్ ఫారమ్ లలో వస్తున్న ప్రకటనను నమ్మొద్దు. ఈ ప్రకటన మొత్తం మోసం, తప్పుదారి పట్టించే విధంగా ఉంది. ఆ ప్రకటనలో పేర్కొన్నట్టుగా ఈ ప్రాజెక్టు రెరాతో నమోదు కాలేదు. ఇదే తమ రెరా నెంబర్ అంటూ అందులో పేర్కొన్న నంబర్ మరో సంస్థకు చెందిన ప్రాజెక్టుది. ప్రమోటర్ ఈ వాణిజ్య ప్రకటనను ఇలా తప్పుడు సమాచారంతో ఇవ్వడం రెరా నిబంధనలను ఉల్లంఘించడమే. ఇలాంటి ప్రకటనలు రియల్ పరిశ్రమలో ప్రతికూల ప్రచారానికి కారణమవుతాయి. పైగా ఇలా చేయడం కొనుగోలుదారులను మోసం చేయడమే అవుతుంది’ అని యూనీ రెరా సెక్రటరీ ప్రమోద్ కుమార్ ఉపాధ్యాయ పేర్కొన్నారు.