హైదరాబాద్లో చాలామంది కాంక్రీటుతో అపార్టుమెంట్లను నిర్మిస్తారు. టవర్లను నిర్మించి మధ్యమధ్యలో గ్రీనరీని జొప్పిస్తారు. కానీ, గిరిధారి హోమ్స్ ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తుంది. ఎవరూ ఊహించని రీతిలో.. కొనుగోలుదారులకేం కావాలనే ఆలోచించి.. ఎలాంటి థీమ్ ఉంటే ప్రజలు ఆస్వాదిస్తారనే అంశాన్ని లోతుగా పరిశోధించి.. నిపుణులతో సుదీర్ఘంగా చర్చించి.. ఆధునిక ప్రాజెక్టులను తీర్చిదిద్దుతుంది. గిరిధారి హోమ్స్ పూర్తి చేసిన ద ఆర్ట్ ప్రాజెక్టును స్వయంగా గమనిస్తే.. ఇందులో సొంతిల్లు కొనకుండా ఉండలేరు.
కరోనా తర్వాత ప్రజల ఆలోచనలు, అభిరుచిలు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు వీరికి కావాల్సింది ఫ్లాట్లు మాత్రమే కాదు.. నిత్య సంతోషాన్ని కలిగించే ప్రాజక్టు కావాలి. అలాంటి ప్రాజెక్టే.. గిరిధారి ద ఆర్ట్. హైదరాబాద్‌లోనే ఎక్కడా లేనటువంటి సైంటిఫిక్ కాన్సెప్టును ఇందులో ప్రవేశపెట్టింది సంస్థ. క్లబ్ హౌజులో నెగటివ్ అయాన్ జోనుతో ఒక వాటర్ ఫాల్ థీమును ప్రవేశపెట్టింది. ముప్పయ్ అడుగుల ఎత్తు నుంచి వాటర్ ఫాల్ కింద పడుతుంటే.. దాన్ని ముందే కూర్చున్నవారి మోముకి ఆ నీటి తుంపర్లు తాకుతుంటే ఎక్కడ్లేని పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది.
ఈ ఆనందాన్ని ప్రతిఒక్కరూ ఆస్వాదించాలని గిరిధారి హోమ్స్ ఆ మొత్తం ప్రాంతాన్ని కళాత్మకంగా తీర్చిదిద్దింది. ఇక్కడ కూర్చుంటే చాలు.. ప్రతిఒక్కరికీ మానసిక ప్రశాంతత లభిస్తుంది. శారీరక ఆరోగ్యం మెరుగవుతుంది. ఆహ్లాదం, వినోదం దొరకుతుంది. పిల్లల్లో సృజనాత్మకత పెరుగుతుంది. ఇలా ప్రతిరోజు పండగే కలిగే విధంగా ప్రాజెక్టును మలిచిన తీరు అద్భుతమని కొనుగోలుదారులే స్వయంగా కొనియాడుతున్నారు.
గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్ మొదటి ఎగ్జిట్ టీఎస్‌పీఏ జంక్షన్ నుంచి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో, అత్యధిక గ్రీనరీ వేలాది ఎకరాలు ఉన్న కాలుష్యం లేని బండ్లగూడలో 3. 8 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకున్నది. కేవలం 5 అంతస్తుల ఎత్తులో.. ఇరవై వేల మొక్కలతో 270 ఫ్లాట్లు గల ఫుల్ గ్రీనరీ ఉన్న కళాత్మకమైన నిర్మాణమిది. తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి రెరా ప్రాజెక్టు అయిన గిరిధారి హెమ్స్ రాజక్షేత్రను కొనుగోలుదారులకు అందించిన విధంగానే.. ఈ ఉగాదికి ద ఆర్ట్ ప్రాజెక్టును ఆర్ట్ అసోసియేషన్ కు అందించే ఉత్సవాల్ని ప్రతి శనివారం సాయంత్రం గిరిధారి హోమ్స్ ఎంతో ఘనంగా నిర్వహిస్తోంది.
తమ ప్రాజెక్టు ఇంత గొప్పది, అంత గొప్పది అని త్రీడీ వీడియోల్లో ప్రతిఒక్కరూ చెప్పుకుంటారు. అది వారి మార్కెటింగ్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. కాకపోతే ఎంతమంది బిల్డర్లు అనుకున్న సమయానికి డెలివరీ చేస్తారనేది కీలకం. ఈ అంశమే కస్టమర్ల సహనాన్ని పరీక్షిస్తుంది. కొవిడ్ మూడు వేవ్లను ఎదుర్కొని, సమయానికి ప్రాజెక్టును అందించడమంటే ఆషామాషీ విషయమేం కాదు. ముఖ్యంగా వేసవిలో పిల్లలకు సెలవులు ఉన్నప్పుడు ప్రకృతియే ఒక ఆర్ట్ అని.. పంచభూతాల్ని మనం ఆస్వాదించినప్పుడే మానసిక ఆహ్లాదం కలుగుతుందని మనసా, వాచా నమ్మి.. హైదరాబాద్లో అత్యంత ఖరీదైన ప్రాజెక్టుల్లో కూడా లేని ఒక వాటర్ ఫాల్ ను అందించిన ఘనత గిరిధారి హోమ్స్ కే దక్కుతుంది.
This website uses cookies.