ఈ నెలాఖరులోగా ఒక సెంటు లేఔట్ల పనులను పూర్తి చేసేందుకు విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్ మెంట్ అథార్టీ (వీఎంఆర్డీఏ) తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. 1.8 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం విశాఖపట్నం జిల్లాలోని దాదాపు 4వేల ఎకరాల్లో 56 లేఔట్లను వీఎంఆర్డీఏ అభివృద్ధి చేస్తోంది. ఈ పనుల పర్యవేక్షణ కోసం పలు ప్రత్యేక బృందాలను నియమించింది. నిజానికి రెండేళ్ల క్రితమే ఈ లేఔట్ల అభివృద్ధి పనులు ప్రారంభం కాగా, కోర్టు కేసుల కారణంగా నిలిచిపోయాయి.
ఇటీవల ఏపీ హైకోర్టు ఆయా కేసులను కొట్టివేయడంతో అధికారులు యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభించారు. ఈనెల 31న ఇళ్ల స్థలాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం వైఎస్ జగన్ ఆ కార్యక్రమంలో పాల్గొని పట్టాలు పంపిణీ చేయనున్నారు. ‘పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడానికి అధికారులు 1.8 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించారు. వారిలో ప్రతి ఒక్కరికీ ఒక సెంటు స్థలం ఇస్తారు. ఈ మేరకు లేఔట్ పనులు చేస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం వీఎంఆర్డీఏకు రూ.150 కోట్లు మంజూరు చేసింది.
This website uses cookies.