టెండర్ ప్రక్రియకు కసరత్తు
చేస్తున్న కేంద్ర ప్రభుత్వం
వచ్చే ఏడాది మార్చిలో
ట్రిపుల్ ఆర్ పనులు ప్రారంభం
ఆరేళ్లలో ట్రిపుల్ ఆర్ ను
పూర్తి చేసేలా ప్రణాళికలు
రీజినల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగాన్ని సొంతంగానే చేపట్టేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగాన్ని కేంద్రమే నిర్మిస్తోంది. గతంలో జాతీయ రహదారిగా మాత్రమే దాన్ని పరిగణించింది. కానీ ఇటీవల దాన్ని ఎక్స్‌ప్రెస్‌వే జాబితాలో చేర్చింది. అప్పటివరకూ తాత్కాలికంగా దానికి 161-ఏ నంబర్‌ను పరిగణనలోకి తీసుకున్నారు. ఇప్పుడు అది కాకుండా ఎక్స్‌ప్రెస్‌వేగా కొత్త నంబర్ కేటాయిస్తారు. ఈ నంబర్ అలాట్ అయిన తర్వాతే ఫారెస్ట్ క్లియరెన్సు వస్తుందని అధికారులు అంటున్నారు.
మరోవైపు రీజినల్ రింగ్ రోడ్డు కు సంబంధించిన భూ పరిహారం పంపిణీకి వీలుగా.. గ్రామాల వారీ అవార్డులు పాస్ చేసే ప్రక్రియ కూడా నిర్వహించాల్సి ఉంది. ఇది జరగాలంటే పరిహారం నిధులు ఎన్‌హెచ్ఏఐకి కేటాయించాలి. ఉత్తర భాగం భూసేకరణ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం సగం మొత్తాన్ని భరించాల్సి ఉన్నందున, ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వం డిపాజిట్ చేయాలి.
ట్రిపుల్ ఆర్ నిర్మాణంలో భాగంగా రాష్ట్ర రహదారులు, జాతీయ రహదారులు కలిసే చోట ఇంటర్‌ఛేంజ్‌లను ఏర్పాటు చేస్తారు. వీటికి తోడు ఉత్తర భాగంలోనే వందకుపైగా అండర్ పాస్‌లు, 85 బ్రిడ్జిలను నిర్మిస్తారు. ఉత్తర భాగం నిర్మాణానికి 13 వేల కోట్లకు పైగా అవసరం కాగా.. క్లస్టర్లు, వంతెనలు, అండర్‌పాస్‌ల నిర్మాణానికే.. 2 వేల కోట్లు అవసరమని అంచనా వేస్తున్నారు. రీజినల్ రింగ్ రోడ్ వెంబడి.. శాటిలైల్ టౌన్ షిప్ లను ఏర్పాటు చేయాలని ప్లాన్.
హైదరాబాద్ చుట్టూ ఏర్పడే ఈ శాటిలైట్ సిటీల వల్ల.. రాజధానితో పాటు, ఇతర చిన్న పట్టణాలకు కనెక్టివిటీ పెరుగుతుంది. ఈ ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ క్లస్టర్లు, లాజిస్టిక్స్ పార్కులు ఏర్పాటవుతాయి. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే భూముల ధరలు భారీగా పెరిగిపోవడంతో.. ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్ మధ్య పెద్ద సంఖ్యలో రియల్ ఎస్టేట్ వెంచర్లను ఏర్పాటవుతాయి. ఫలితంగా మధ్యతరగతి ప్రజలు సిటీకి సమీపంతో పోలిస్తే తక్కువ ధరకే ఈ ప్రాంతాల్లో ప్లాట్లు కొనే అవకాశం కలుగుతుంది.
కాకపోతే, ట్రిపుల్ ఆర్ పూర్తయ్యేనాటికి పెరగాల్సిన రేట్లను ఇప్పటికే పెంచేశారు రియల్టర్లు, ఏజెంట్లు. ఇలా రేట్లను పెంచుకుంటూ పోతే, అక్కడి మార్కెట్ కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా పోతుంది.
This website uses cookies.