హైదరాబాద్‌లోని ఇళ్ల కొనుగోలుదారులకు తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ శుభవార్త ప్రకటించింది. 2022 జనవరి లేదా ఫిబ్రవరిలో ప్రాపర్టీ షో నిర్వహించాలని నిర్ణయించింది. ఇటీవల జరిగిన సంఘ సర్వసభ్య సమావేశంలో సభ్యులందరూ ఏకగ్రీవంగా ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ప్రాపర్టీ షోను ఎక్కడ నిర్వహించాలి? ఎలా నిర్వహించాలి? ఇందుకు సంబంధించిన కార్యచరణ ఏమిటి? తదితర అంశాలపై సంఘ సభ్యులు క్షుణ్నంగా చర్చించి నిర్ణయం తీసుకుంటారు. తమ ప్రాపర్టీ షోలో ఎంతలేదన్నా వంద నుంచి నూటయాభై మంది బిల్డర్లు పాల్గొనే అవకాశముందని టీబీఎఫ్ అధ్యక్షుడు సీహెచ్ ప్రభాకర్ రావు తెలిపారు.
This website uses cookies.